సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో మరోసారి హైడ్రా అక్రమ కట్టడాలను కూల్చి వేస్తుంది. పెద్ద చెరువుకు అనుకొని రూల్స్ కు విరుద్దంగా కట్టిన ప్రహారీ గోడను ఆఫీసర్లు నేలమట్టం చేశారు. ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి చెందినదిగా అధికారులు గుర్తించారు. గతంలోనూ హైడ్రా అధికారులు మాజీ ఎమ్మెల్యేకు సంబంధించిన ఈ గోడను సర్వే చేసి మూడు నెలల కిందట కూల్చివేశారు. మళ్లీ రూల్స్ కు విరుద్ధంగా కొద్దిరోజులకే మాజీ ఎమ్మెల్యే కాటసాని మళ్లీ తిరిగి ఐరన్ఫెన్సింగ్ తో గోడను నిర్మించారు. దీనిపై బాధితులు హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. దీంతో మరోసారి హైడ్రా అధికారులు చర్యలు చేపట్టింది.
కబ్జా చేయాల్సిన అవసరం లేదు: మాజీ ఎమ్మెల్యే కాటసాని
ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేయాల్సిన అవసరం తనకు లేదని మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. అమీర్పూర్లో హైడ్రా కూల్చివేతలపై కాటసాని స్పందించారు. రూల్స్ ప్రకారమే కాంపౌండ్వాల్ కట్టిన్నట్లుగా ఆయన తెలిపారు. 'హైడ్రా ఎలాంటి నోటిసులు ఇవ్వలేదు. కూల్చివేతలపై హైడ్రా ఆఫీసర్లు సమాధానం చెప్పాలి. 'అని మాజీ ఎమ్మెల్యే కాటసాని అన్నారు.