అక్రమార్కులకు దడపుట్టిస్తున్న హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో అక్రమంగా అనుమతులు ఇచ్చిన అధికారులపై కొరడా ఝుళిపించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చిన అధికారుల జాబితాను సిద్ధం చేస్తోంది.
రూల్స్ ను అతిక్రమించి అనుమతులు ఇచ్చిన రెవెన్యూ ఆఫీసర్లపై క్రిమినల్ కేసు పెట్టేందుకు సిద్ధమవుతోంది. హైడ్రా తాజా నిర్ణయం కొందరు అధికారుల్లో గుబులు పుట్టిస్తోంది.