KTR : ఆ బీజేపీ ఎంపీ పేరు ఇప్పుడే చెప్పను : కేటీఆర్

Update: 2025-04-12 07:30 GMT

కంచ గచ్చిబౌలి భూముల్లో రూ.10 వేల కోట్ల స్కాం జరిగిందని.. అయితే ఈకుంభకోణం వెనుక ఉన్న బీజేపీ ఎంపీ పేరును తాను ఇప్పుడే చెప్పనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. దీనికి కర్త, కర్మ, క్రియ అన్నీ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డేనని అని తెలిపారు. సీఎం, ఓ బీజేపీ ఎంపీ కలిసి రూ. 60 వేల కోట్ల హెచ్ఎండీఏ భూములను కొల్లగొట్టేందుకు సిద్ధమయ్యారని.. ఆ ఆధారాలను కూడా సేకరించి అన్ని ఒకేసారి బయటపెడతానని చెప్పారు. అటవీ భూమిని తాకట్టు పెట్టడం, అమ్మే అధికారం ప్రభుత్వానికి కూడా లేదని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ‘బీజేపీ ఎంపీ సపోర్ట్ తోనే రేవంత్ రెడ్డి.. హెచ్సీయూ భూముల కుంభకోణానికి తెరతీశారు. రూ. 5,200 కోట్లు విలువ కలిగిన భూమిని రూ. 30 వేల కోట్లుగా చూపించారు. ఆర్బీఐ నిబంధనలు పాటించకుండా.. 10 వేల కోట్లు తెచ్చారు. లిటికేషన్ ల్యాండ్ కు ఐసీఐసీఐ బ్యాంకు ఎలా లోన్ ఇచ్చింది? ముఖ్యమంత్రికి అన్నీ తెలిసే భారీ ఆర్థిక నేరానికి పాల్పడ్డారు. ట్రస్ట్ ఎడ్వజెర్స్ ఇన్వెస్ట్మెంట్ అనే కంపెనీ రేవంత్ రెడ్డికి బ్రోకరిజం చేసింది. అందుకు గాను .. సదరు కంపెనీకి రూ.170 కోట్లు లంచం ఇచ్చారు. కాంగ్రెస్ పాలన అంటేనే.. మోసం, విధ్వంసం, దృష్టి మళ్లింపు. భయంక రమైన అర్థిక దోపిడీకి రేవంత్ పాల్పడుతున్నా రు. పర్యావరణ విధ్వంసం మాత్రమే కాదు.. అతిపెద్ద కుంభకోణం. తమది కాని భూమిని టీజీఐఐసీ ఎలా తాకట్టు పెడ్తుంది? కేంద్రానికి చిత్తశుద్ది ఉంటే వెంటేనే సీవీసీ, సీబీఐ విచారణ జరపాలి. సెంట్రల్ స్పందించకుంటే కాంగ్రెస్, బీజేపీ మధ్య ఒప్పందం ఉన్నట్లే' అని అన్నారు.

Tags:    

Similar News