Hyderabad : డీమార్ట్‌కు ఇతడు ఏం చేశాడో తెలిస్తే.. షాకవుతారు..

Update: 2025-07-05 07:30 GMT

హైదరాబాద్ లో ఇలాచీ ప్యాకెట్లను దొంగతనం చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. డీమార్ట్ నుంచి సదరు వ్యక్తి ఈ ప్యాకెట్లను దొంగతనం చేశాడు. సనత్‌నగర్‌లోని డీమార్ట్‌లో 100 గ్రాముల ఇలాచీ ప్యాకెట్లు మిస్ అవుతున్నట్లు సిబ్బంది గుర్తించారు. ఓ రోజు సీసీటీవీని చెక్ చేయగా.. ఓ వ్యక్తి ప్యాకెట్లను తీసుకుని వాష్‌రూమ్‌లోకి వెళ్లి లోదుస్తుల్లో దాచుకుని బయటకు వెళ్లిపోతున్నట్లు గుర్తించారు. అదేరోజు సాయంత్రం మళ్లీ అతడు అదే డీమార్ట్ కు వెళ్లి.. మరో రెండు ఇలాచీ ప్యాకెట్లను తీసుకుని బయటకు వెళ్లడానికి ప్రయత్నించాడు. అయితే వెంటనే గుర్తించిన సిబ్బంది.. అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడిని దీపక్ కుమార్ గా గుర్తించిన పోలీసులు.. ఇప్పటివరకు.. 22 ప్యాకెట్లు తీసుకెళ్లినట్లు చెప్పారు. ఇలాచీ రేట్ ఎక్కువ కాబట్టి చోరీ చేస్తున్నట్లు విచారణలో ఒప్పుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Tags:    

Similar News