భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. ఫ్యాక్టరీలో నూతనంగా నిర్మించిన పవర్ ప్లాంట్‌ను విజయదశమి సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈనెల 12 వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రారంభ ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 36 కోట్లతో నూతన పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసిందని, రైతులకు పవర్ ప్లాంట్ నిర్మాణం శుభ పరిణామన్నారు. రైతులందరూ పామాయిల్ ఫ్యాక్టరీకి వచ్చి తమతోపాటు నూతన పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొనాలని రైతులకు కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.