INDIGO: ఎగరని ఇండిగో విమానాలు.. ఆగ్రహావేశాలు

పతాకస్థాయికి చేరిన ఇండిగో సంక్షోభం... టెర్మినళ్లలోనే ప్రయాణికుల తిండీనిద్ర... సిబ్బంది మధ్య లేని సమన్వయం..

Update: 2025-12-06 04:30 GMT

ఇం­డి­గో ఎయి­ర్‌­లై­న్స్‌ సం­స్థ ముం­ద­స్తు సమా­చా­రం లే­కుం­డా వి­మాన సర్వీ­సు­ల్ని రద్దు చే­య­డం­తో శం­షా­బా­ద్‌ వి­మా­నా­శ్ర­యం­లో ప్ర­యా­ణి­కు­లు ఆగ్ర­హా­వే­శా­లు వ్య­క్తం చే­శా­రు. ముం­ద­స్తు సమా­చా­రం లే­కుం­డా శు­క్ర­వా­రం ఒక్క­రో­జే 155 వి­మాన సర్వీ­సు­ల­ను రద్దు చే­య­డం­తో వే­ల­మం­ది తీ­వ్ర ఇబ్బం­దు­లు పడ్డా­రు. ఇం­దు­లో శం­షా­బా­ద్‌ నుం­చి వె­ళ్లా­ల్సి­న­వి 84 ఉం­డ­గా.. వేరే ప్రాం­తాల నుం­చి ఇక్క­డ­కు రా­వా­ల్సి­న­వి 71 ఉన్నా­యి. తె­ల్ల­వా­రు­జా­ము నుం­చే వి­మా­నా­శ్ర­యం­లో గం­ద­ర­గోళ పరి­స్థి­తు­లు నె­ల­కొ­న్నా­యి. ఆన్‌­లై­న్‌­లో వి­మాన సర్వీ­సుల రా­క­పో­క­లు యథా­వి­ధి­గా సా­గు­తు­న్న­ట్లు చూ­పి­స్తుం­డ­డం.. వి­మా­నా­శ్ర­యం­లో పరి­స్థి­తు­లు అం­దు­కు భి­న్నం­గా ఉం­డ­డం­తో ప్ర­యా­ణి­కు­లు ఆగ్ర­హో­ద­గ్రు­ల­య్యా­రు. ధర్నా­కు కూడా ది­గా­రు. చె­కి­న్‌ పూ­ర్త­య్యాక సర్వీ­సు­ల­ను రద్దు­చే­సి­న­ట్లు ప్ర­క­టిం­చ­డం­తో ఎంతో ఆం­దో­ళ­న­కు గు­ర­య్యా­రు. ఇం­డి­గో కౌం­ట­ర్ల వద్ద నగదు వె­న­క్కి తీ­సు­కో­వ­డా­ని­కి, రీ­షె­డ్యూ­ల్‌ చే­సు­కో­వ­డా­ని­కి క్యూ­లై­న్ల­లో పడి­గా­పు­లు­ప­డ్డా­రు. తగి­న­న్ని కు­ర్చీ­లు లేక కొం­ద­రు నే­ల­పై­నే కూ­ర్చుం­డి­పో­యా­రు. అత్య­వ­స­రం­గా వె­ళ్లా­ల్సి­న­వా­రు ఇతర వి­మా­న­యాన సం­స్థల నుం­చి టి­కె­ట్లు కొ­నేం­దు­కు యత్నిం­చ­గా... ధరలు ఆకా­శా­న్నం­టా­యి. హై­ద­రా­బా­ద్‌-కోచి వి­మా­నం నా­లు­గో రోజూ రద్దు కా­వ­డం­తో శబ­రి­మ­లై వె­ళ్లే భక్తు­లు శు­క్ర­వా­రం తె­ల్ల­వా­రు­జా­మున ఆం­దో­ళన చే­ప­ట్టా­రు.

శం­షా­బా­ద్‌ నుం­చి వి­జ­య­వా­డ­కు వె­ళ్లేం­దు­కు వి­మా­నా­శ్ర­యా­ని­కి వచ్చిన ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌ మం­త్రి కొ­లు­సు పా­ర్థ­సా­ర­థి­కి తె­లి­య­జే­య­గా... ఆయన వెం­ట­నే కేం­ద్ర పౌర వి­మా­న­యాన మం­త్రి రా­మ్మో­హ­న్‌­నా­యు­డు­తో ఫో­న్‌­లో మా­ట్లా­డి ప్ర­త్యేక వి­మా­నా­న్ని ఏర్పా­టు చే­యిం­చా­రు.

 దిల్లీ-హైదరాబాద్‌కు రూ.33వేలు

శని­వా­రం ప్ర­యా­ణా­ని­కి గానూ.. ది­ల్లీ నుం­చి హై­ద­రా­బా­ద్‌­కు ఎయి­రిం­డి­యా టి­కె­ట్‌ కనీస ధర రూ.33వే­ల­కు చే­రిం­ది. 7వ తే­దీ­కి ది­ల్లీ-చె­న్నై ఎకా­న­మీ క్లా­స్‌ కనీస టి­కె­ట్‌ ధర రూ.53వే­లు­గా, ది­ల్లీ-హై­ద­రా­బా­ద్‌ కనీస టి­కె­ట్‌ ధర రూ.25వే­లు­గా ఉంది. భా­ర­త్‌­లో అతి­పె­ద్ద వి­మా­న­యాన సం­స్థ ఇం­డి­గో కం­పె­నీ వె­బ్‌­సై­ట్‌ ప్ర­కా­రం.. రో­జు­కు దా­దా­పు 2,200 వి­మాన సర్వీ­సు­ల­ను నడు­పు­తోం­ది. ఎయి­రిం­డి­యా­తో పో­లి­స్తే ఇది రెం­డిం­త­లు. అలాం­టి ఎయి­ర్‌­లై­న్‌ ఇప్పు­డు సాం­కే­తిక సమ­స్య­లు, సి­బ్బం­ది­కి సం­బం­ధిం­చిన కొ­త్త రో­స్ట­ర్‌ ని­య­మా­లు తది­తర కా­ర­ణా­ల­తో ఇబ్బం­దు­లు ఎదు­ర్కొం­టోం­ది. దీం­తో శు­క్ర­వా­రం దా­దా­పు 500 వి­మా­నా­ల­ను రద్దు చే­యా­ల్సిన పరి­స్థి­తి నె­ల­కొం­ది. ఇప్ప­టి­కే ది­ల్లీ, హై­ద­రా­బా­ద్‌, చె­న్నై వి­మా­నా­శ్ర­యా­ల్లో ఇం­డి­గో వి­మాన సర్వీ­సు­లు రద్ద­య్యా­యి. మరి­కొ­న్ని­చో­ట్ల ఆల­స్యం­గా నడు­స్తు­న్నా­యి.

ఇండిగో వ్యవహారంపై స్పందించిన కేంద్రమంత్రి

గత రెం­డు రో­జు­లు­గా రద్ద­యిన వి­మాన సర్వీ­సు­లు క్లి­య­ర్ అయ్యా­య­ని, రే­ప­టి నుం­చి వి­మా­నా­శ్ర­యా­ల్లో సా­ధా­రణ కా­ర్య­క­లా­పా­లు ప్రా­రం­భ­మ­వు­తా­య­ని పౌర వి­మా­న­యాన శాఖ మం­త్రి రా­మ్మో­హ­న్ నా­యు­డు ఆశా­భా­వం వ్య­క్తం చే­శా­రు. వి­మా­నాల రద్దు వ్య­వ­హా­రం క్ర­మం­గా కొ­లి­క్కి వస్తోం­ద­ని ఆయన అన్నా­రు. రద్దీ లేదా వేచి ఉండే పరి­స్థి­తి ఉం­డ­ద­ని ఆశి­స్తు­న్న­ట్లు చె­ప్పా­రు. వెం­ట­నే మొ­ద­లు పె­ట్ట­గ­లి­గే అన్ని కా­ర్య­క­లా­పా­ల­ను ప్రా­రం­భిం­చా­ల­ని ఇం­డి­గో­ను ఆదే­శిం­చి­న­ట్లు తె­లి­పా­రు. సా­ధా­రణ స్థి­తి­కి తీ­సు­కు­రా­వ­డ­మే తమ తక్షణ కర్త­వ్య­మ­ని ఆయన వె­ల్ల­డిం­చా­రు. ప్ర­యా­ణి­కు­ల­కు సౌ­క­ర్యా­లు కల్పిం­చేం­దు­కు ఏర్పా­ట్లు చే­స్తు­న్న­ట్లు తె­లి­పా­రు. ఫ్లై­ట్ డ్యూ­టీ టైమ్ లి­మి­టే­ష­న్ ని­బం­ధ­న­లు, షె­డ్యూ­లిం­గ్ నెట్ వర్క్‌­ను తాము ని­శి­తం­గా పరి­శీ­లి­స్తు­న్నా­మ­ని అన్నా­రు.

Tags:    

Similar News