జూనియర్ కళాశాలలు 2025-26 విద్యా సంవ త్సరానికి సంబంధించిన ప్రవేశాల షెడ్యూల్ను ఇంటర్ బోర్డు వెల్లడించింది. మొదటి దశ దరఖాస్తుల స్వీకరణ గురువారం నుంచి ప్రారంభమైంది. విద్యార్థులు మే చివరి వరకూ తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం (ఇంటర్ ఫస్ట్ ఇయర్) తరగతులు జూన్ 2 నుంచి ప్రారంభం కానున్నాయి. పదో తరగతి ఫలితాలు వెలువడిన వెంటనే విద్యార్థులు తమకు నచ్చిన కళాశాలల్లో చేరేందుకు ఈ షెడ్యూల్ ఉపయోగపడుతుంది. కళాశాలలు తమ వెబ్ సైట్లలో, నోటీస్ బోర్డులలో పూర్తి వివరాలను అందుబాటులో ఉంచుతాయి. విద్యార్థులు ఆయా కళాశాలల నిబంధనలు, అర్హత ప్రమాణాలను తెలుసుకొని దరఖాస్తు చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు.