సింధు ఆదర్శ్ రెడ్డికి ప్రగతి భవన్ నుంచి పిలుపు.. మేయర్ అభ్యర్దా?
గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు మంచి పోటీ ఇచ్చింది బీజేపీ. అయితే.. ఈ ఎన్నికల్లో అధికారానికి కావాల్సిన సీట్లను ఏ పార్టీకి కూడా దక్కించుకోలేదు. తప్పనిసరిగా సెంచరీ కొడతామంటూ..;
గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు మంచి పోటీ ఇచ్చింది బీజేపీ. అయితే.. ఈ ఎన్నికల్లో అధికారానికి కావాల్సిన సీట్లను ఏ పార్టీకి కూడా దక్కించుకోలేదు. తప్పనిసరిగా సెంచరీ కొడతామంటూ చెప్పిన టీఆర్ఎస్ కు ఓటర్లు చుక్కలు చూపించారు. మేయర్ పీఠం దక్కించుకోవాలంటే 76 స్థానాల్లో విజయం సాధించాలి. కానీ... ఏ ఒక్క పార్టీ కూడా 60 దాటలేదు. దాంతో హంగ్ తప్పదంటున్నారు విశ్లేషకులు. ఎంఐఎం మద్దతుతో మేయర్ పీఠం టీఆర్ఎస్ దక్కించుకోనుందనే ప్రచారం జరుగుతోంది. 2016 ఎన్నికల్లో కేవలం 4 స్థానాలకే పరిమితైన బీజేపీ తాజాగా 48 స్థానాల్లో విజయం సాధించి రెండవ స్థానంలో నిలిచింది. దీన్ని బట్టి చూస్తే హైదరాబాద్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని స్పష్టంగా అర్థమవుతోంది.
ఇప్పటికే మేయర్ అభ్యర్థి ఎంపికపై దృష్టి పెట్టింది టీఆర్‌ఎస్ హైకమాండ్. 111 డివిజన్ భరత్ నగర్‌లో విజయం సాధించిన టీఆర్‌ఎస్ అభ్యర్థి సింధు ఆదర్శ్ రెడ్డి ప్రగతి భవన్‌కు రావాలని పిలుపు అందుకున్నట్లు తెలుస్తోంది. మెదక్ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి కోడలే సింధు ఆదర్శ్ రెడ్డి. అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. బీజేపీ ప్రచారం చేసినట్లుగా మేయర్ పదవి కావాలని ఎంఐఎం కోరితే మాత్రం రాజకీయాల్లో చాలా మార్పులే రానున్నాయి.