KTR Fire On BJP : టీఆర్ఎస్ లేకపోతే.. టీ కాంగ్రెస్, టీ బీజేపీ ఏర్పడేవా? : కేటీఆర్
KTR Fire On BJP : ఒకట్రెండు విజయాలకే బీజేపీ నేతలు ఎగిరిపడుతున్నారని తగిన సమయంలో బుద్ధి చెప్తామన్నారు మంత్రి కేటీఆర్.;
ఒకట్రెండు విజయాలకే బీజేపీ నేతలు ఎగిరిపడుతున్నారని తగిన సమయంలో బుద్ధి చెప్తామన్నారు మంత్రి కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ లేకపోతే టీ కాంగ్రెస్, టీ బీజేపీ బీజేపీ ఏర్పడేవి కావని.. అది కేసీఆర్ భిక్ష అని తెలిపారు. సీఎం కేసీఆర్ మీద ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని.. 20 ఏళ్లలో అనేక పరిస్థితులను నిలదొక్కుకొని ఈ స్థాయికి వచ్చామని గుర్తుచేశారు మంత్రి కేటీఆర్.ఇక ఈ నెలాఖరు లోపు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ సూచించారు. టీఆర్ఎస్ పార్టీ అందరి పార్టీ అని ప్రతి గ్రామంలో అందర్నీ కలుపుకుపోవాలన్నారు కేటీఆర్.