Jagga Reddy : మళ్లీ అసంతృప్తి వెళ్లగక్కిన జగ్గారెడ్డి

Update: 2024-12-13 11:45 GMT

సొంత పార్టీ నేతలపై తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. ఏఐసీసీ కార్యదర్శి విష్ణు, దీపాదాస్ మున్షి మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో సీనియర్లం అయిన తమను సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. కొత్త వాళ్లకు ప్రాధాన్యత ఇచ్చే విషయం ఫైనల్ అయ్యే వరకు తమకు సమాచారం ఇవ్వరా..అని ప్రశ్నించారు. పార్టీ కోసం పనిచేసిన వారిని.. ఎన్నికల్లో గెలిచేందుకు కృషి చేసిన వారిని ఎవరు పట్టించుకోవాలని అడిగారు. అసలు విష్ణు ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్నారా..దీపాదాస్‌ మున్షీ తెలంగాణ రాష్ట్రానికే పనిచేస్తున్నారా? లేక వేరే రాష్ట్రం వెళ్లిపోయారా..అని ప్రశ్నించారు జగ్గారెడ్డి.

Tags:    

Similar News