Smita Sabharwal : స్మితా సబర్వాల్ పై చర్యలు తీసుకోవాలి.. జీవన్ రెడ్డి డిమాండ్
అఖిలభారత సర్వీసు ఉద్యోగాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్ల కోటాపై సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్ చేసిన వ్యాఖ్యానాలపై శాసన మండలిలో వాడీ వేడి చర్చ జరిగింది. అనేక అత్యున్నత బాధ్యతలు నిర్వహించిన స్మితా సభర్వాల్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆమెను తేలిక పరుస్తున్నాయని మండలిలో సభ్యులు విచారం వ్యక్తం చేశారు.
గురువారం శాసనమండలిలో సభ్యుడు జీవన్ రెడ్డి మాట్లాడుతూ స్మితా సభర్వాల్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ ఐఏఎస్ అధికారి దివ్యాం గుల మనోభావాలు దెబ్బతీసే విధంగా సోషల్ మీడియాలో పోస్టు చేయడం పట్ల దేశంలోని అనేక సంస్థలు, వ్యవస్థలు విచారం వ్యక్తం చేస్తున్నా యన్నారు. దివ్యాంగుల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడిన స్మితా సభర్వాల్ చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.