Telangana : తెలంగాణలో జెట్ ఇంజిన్ల సర్వీసింగ్ పరిశ్రమ

Update: 2025-06-25 07:30 GMT

విమాన ఇంజిన్ల తయారీ సంస్థ సఫ్రాన్ తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. ఏరోస్పేస్ ఇంజినీరింగ్ వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఫ్రెంచ్ సంస్థ సఫ్రాన్ హైదరాబాద్లో ఇప్పటికే రెండు ప్రపంచస్థాయి ఉత్పాదక కేంద్రాలను ఏర్పాటు చేసింది. తాజాగా మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో సఫ్రాన్ జనరల్ మేనేజర్ పియరీ ఫెర్నాండెజ్ కొత్త పెట్టుబడులను ప్రతిపాదించారు. ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్ సర్వీసెస్ అనే కంపెనీ నెలకొల్పనున్నట్టు వెల్లడించారు. రఫేల్, ఎం 88 ఫైటర్ జెట్ ఇంజిన్ల నిర్వహణ, ఓవర్ హాలింగ్ పనులను సఫ్రాన్ చేపడుతుంది. దీనివల్ల వచ్చే ఏడాది చివరి నాటికి 150 కొత్త ఉద్యోగాలు లభిస్తాయి. తర్వాత దశల్లో మరో 750 ఉద్యోగాలు వస్తాయి. రఫేల్ యుద్ధ విమానాల ఇంజన్లకు కీలక విడిభాగాలను సఫ్రాన్ తయారు చేస్తుంది. ఇక్కడి నుంచే ఇతర దేశాలకు సరఫరా చేస్తుంది. హైదరాబాద్ అతిపెద్ద ఏరో స్పేస్ హబ్ గా రూపుదిద్దుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి పియరీ ఫెర్నాండెజ్.. మంత్రి శ్రీధర్ బాబుకు థ్యాంక్స్ చెప్పారు.

Tags:    

Similar News