TG high court: కేసీఆర్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్..
సాయంత్రం లేదా సోమవారం తీర్పు వెల్లడించే అవకాశం;
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ విద్యుత్ కమిషన్ పై హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.. జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలని రిట్ పిటిషన్ వేశారు. కమిషన్ ఏర్పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని కేసీఆర్ పిటిషన్లో పేర్కొన్నారు. నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు జరిగిందని.. జస్టిస్ నర్సింహారెడ్డి ప్రెస్ మీట్ల పెట్టి మరీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కేసీఆర్ తెలిపారు.
ఈ క్రమంలో.. కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. కేసీఆర్ పిటిషన్‌కు విచారణ అర్హత ఉందా లేదా అనే దానిపై వాదనలు ముగిశాయి. అనంతరం కేసీఆర్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ చేసినట్లు హైకోర్టు తెలిపింది. ఇవాళ సాయంత్రం లేదా సోమవారం తీర్పు వెల్లడించే అవకాశం ఉంది. ప్రభుత్వం తరఫున వాదనలను ఏజీ వినిపించారు. కాగా, విద్యుత్ కొనుగోలు అంశంపై హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ కొనసాగుతోంది.