K Kavitha: ఎమ్మెల్సీగా కవిత ఏకగ్రీవం.. మరోసారి నిజామాబాద్‌లో టీఆర్ఎస్ హవా..
K Kavitha: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ స్థానం నుంచి కల్వకుంట్ల కవిత ఏకగ్రవం అయ్యారు.;
K Kavitha (tv5news.in)
K Kavitha: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ స్థానం నుంచి కల్వకుంట్ల కవిత ఏకగ్రవం అయ్యారు. ధృవీకరణ పత్రం అందుకునేందుకు నిజామాబాద్ కలెక్టరేట్‌కు వచ్చిన కవింత వెంట మంత్రి ప్రశాంత్ రెడ్డి,ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. కవితకు కలెక్టర్ ధృవీకరణ పత్రం అందజేశారు. తనను ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు కవిత. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.