KAVITHA: రామన్న... నాన్న జాగ్రత్త

కేటీఆర్‌కు జాగృతి నాయకురాలు కవిత హెచ్చరిక.. హరీశ్‌రావు, సంతోష్‌రావులపై నిప్పులు చెరిగిన కవిత... ఆరడుగుల బుల్లెట్ దిగుతుందని తీవ్ర ఆరోపణలు

Update: 2025-09-04 02:30 GMT

బీ­ఆ­ర్ఎ­స్ వర్కిం­గ్ ప్రె­సి­డెం­ట్ కే­టీ­ఆ­ర్‌­కు హరీ­శ్‌­రా­వు­తో ము­ప్పు పొం­చి ఉం­ద­ని కల్వ­కుం­ట్ల కవిత సం­చ­లన ఆరో­ప­ణ­లు చే­శా­రు. హరీ­శ్ రావు, సం­తో­ష్ రావు... బీ­ఆ­ర్ఎ­స్ మంచి కో­రు­కు­నే వారు కా­ద­ని అన్నా­రు. ఇప్పు­డు నన్ను పా­ర్టీ నుం­చి బయ­ట­కు పం­పా­ర­ని.. రేపు కే­టీ­ఆ­ర్‌­కు కూడా అదే పరి­స్థి­తి ఎదు­రు కా­వ­చ్చ­ని అన్నా­రు. "నా­న్న అన్న­ను కా­పా­డు" అంటూ కవిత కే­సీ­ఆ­ర్‌­కు సూ­చిం­చా­రు. కే­టీ­ఆ­ర్ కూడా అప్ర­మ­త్తం­గా ఉం­డా­ల­ని అన్నా­రు. "రా­మ­న్నా.. నా­న్న ఆరో­గ్యం జా­గ్ర­త్త" అంటూ కవిత హె­చ్చ­రిం­చా­రు. తన ప్రా­ణం పో­యి­నా కే­టీ­ఆ­ర్, కే­సీ­ఆ­ర్‌­కు హాని జర­గా­ల­ని కో­రు­కో­న­ని స్ప­ష్టం చే­శా­రు. భారత రా­ష్ట్ర సమి­తి నుం­చి సస్పెం­డ్‌ చే­సిన నే­ప­థ్యం­లో కవిత మీ­డి­యా సమా­వే­శం ని­ర్వ­హిం­చా­రు. హై­ద­రా­బా­ద్‌­లో­ని తె­లం­గాణ జా­గృ­తి కా­ర్యా­ల­యం­లో మా­ట్లా­డా­రు. భారత రా­ష్ట్ర సమి­తి ప్రా­థ­మిక సభ్య­త్వా­ని­కి, ఎమ్మె­ల్సీ పద­వి­కి రా­జీ­నా­మా చే­స్తు­న్న­ట్లు ఈ సం­ద­ర్భం­గా కవిత ప్ర­క­టిం­చా­రు. "బం­గా­రు తె­లం­గాణ అంటే హరీ­శ్‌­రా­వు, సం­తో­ష్‌ ఇళ్ల­ల్లో బం­గా­రం ఉంటే అవు­తుం­దా?సమా­జం­లో ప్ర­తి ఒక్క­రూ బా­గుం­టే­నే బం­గా­రు తె­లం­గాణ అవు­తుం­ది." అని కవిత అన్నా­రు. హరీ­శ్‌­రా­వు పె­ద్ద డ్రా­మా ఆర్టి­స్టు అని వి­మ­ర్శిం­చిం­ది. 2018 ఎన్ని­క­ల్లో 25 మంది ఎమ్మె­ల్యే­ల­కు అద­న­పు ఫం­డిం­గ్ ఇచ్చా­ర­ని ఆరో­పిం­చా­రు. హరీ­శ్ ట్ర­బు­ల్ షూ­ట­ర్ కా­ద­ని... బబు­ల్ షూ­ట­ర్ అని అన్నా­రు. సమ­స్య­ను తానే పరి­ష్క­రిం­చి­న­ట్లు హరీ­శ్ డ్రా­మా చే­స్తా­ర­ని ఆరో­పిం­చా­రు.

బుజ్జగించి అడుగుతున్నా..

" నేను రా­మ­న్నను గడ్డం పట్టు­కొ­ని, బు­జ్జ­గిం­చి అడు­గు­తు­న్నా. ఒక చె­ల్లి­ని, మహి­ళా ఎమ్మె­ల్సీ­ని.. నాపై కు­ట్ర­లు జరు­గు­తు­న్నా­య­ని గతం­లో తె­లం­గాణ భవ­న్‌­లో ప్రె­స్‌­మీ­ట్‌ పె­ట్టి చె­ప్పా. మీరు వర్కిం­గ్‌ ప్రె­సి­డెం­ట్‌­గా ఉన్నా­రు. ఏం జరి­గిం­దో నాకు ఫో­న్‌ చే­య­రా అన్నా? నేను కూ­ర్చొ­ని ప్రె­స్‌­మీ­ట్‌ పె­డి­తే­నే న్యా­యం జర­గ­లే­దం­టే.. మా­మూ­లు మహి­ళా కా­ర్య­క­ర్త­కు పా­ర్టీ­లో అన్యా­యం జరి­గి­తే స్పం­ది­స్తా­రా" అని కవిత ప్రశ్నించారు.

హరీశ్‌రావు రేవంత్ కాళ్లు పట్టుకున్నారు.

మాజీ మం­త్రి హరీ­శ్‌­రా­వు­పై MLC కవిత సం­చ­లన ఆరో­ప­ణ­లు చే­శా­రు. సీఎం రే­వం­త్ రె­డ్డి, హరీ­శ్‌­రా­వు ఒకే వి­మా­నం­లో వె­ళ్లి­న­పు­డు­తే.. BRS పా­ర్టీ­పై, KCR ఫ్యా­మి­లీ­పై కు­ట్ర­లు స్టా­ర్ట్ అయ్యా­య­న్నా­రు. హరీ­శ్‌­రా­వు రే­వం­త్ రె­డ్డి కాలు పట్టు­కు­న్నా­ర­ని, అం­దు­కే ఆయ­న­ను కే­సుల నుం­చి తప్పిం­చి కే­సీ­ఆ­ర్‌­ను ఇరి­కిం­చే ప్ర­య­త్నం చే­స్తు­న్నా­ర­ని మం­డి­ప­డ్డా­రు. BRS నుం­చి తనను సస్పెం­డ్‌ చే­య­డం­పై కవిత స్పం­ది­స్తూ.. ఈ వ్యా­ఖ్య­లు చే­శా­రు.

Tags:    

Similar News