Kamareddy: కారును ఢీ కొట్టిన ఆర్‌టీసీ బస్సు.. అయిదుగురు మృతి..
Kamareddy: కామారెడ్డి జిల్లా మాచారెడ్డి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.;
Kamareddy: కామారెడ్డి జిల్లా మాచారెడ్డి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిరిసిల్లవైపు నుంచి కామారెడ్డి రెడ్డి వైపు వస్తున్న కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీ కొట్టింది. ప్రమాద సమయంలో కారులో ఆరుగురు ఉండగా ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతి చెందిన వారిని రామకృష్ణ, కల్పన, సువర్ణ, శ్రీరామ్‌గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన 14 ఏళ్ల రాఘవ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆర్టీసీ బస్సు ముందు టైర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. కారు నెంబర్ ఆధారంగా... మృతులంతా.. నిజామాబాద్ జిల్లా బ్యాంక్ కాలనీకి చెందినవారిగా భావిస్తున్నారు.