Karge : 4న హైదరాబాద్‌కు ఖర్గే రాక.. ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభ

Update: 2025-06-30 08:15 GMT

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జూలై 4 న హైదరాబాద్ రానున్నారని, ఈ సందర్భంగా పీఏసీ సమావేశం అనంతరం టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం జరుగుతుందని పీసీసీ చీఫ్ మహేశ్ తెలిపారు. అదేరోజు సాయంత్రం ఎల్బీ స్టేడియంలో గ్రామస్థాయి బహిరంగ ఉంటుందని, ఈ సభకు 15,000 మంది గ్రామ కమిటీల సభ్యులు హాజరవుతారని వెల్లడించారు. జై బాపు.. జై భీమ్.., జై సంవిధాన్ కార్య క్రమంలో భాగంగా ఈ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ సిద్ధాంతాలు ఉన్న వ్యక్తి డీఎస్ అనీ, తమ పార్టీలోనే రాజకీయ ఓనమాలు దిద్దుకున్నారని చెప్పారు. డీఎస్ విగ్రహానికి కాంగ్రెస్ ప్రభుత్వమే స్థలం కేటాయించిందని, కాంగ్రెస్ నాయకులకు ఎవరికి కూడా ఆహ్వానం అందలేదని బీజేపీ నేతలకు కౌంటరిచ్చారు. ఆయన బీజేపీలో ఏనాడూ లేడనీ.. కొన్ని కారణాల వల్ల బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారరని చెప్పారు. ఆ తర్వాత మాతృసంస్థలోకి వచ్చారనీ.. జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక ఎప్పుడు జరిగినా మేమే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారుత. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ విగ్రహం హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తామని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు.

Tags:    

Similar News

TG: యమ"పాశం"