హిందూ ఏక్తా యాత్ర నేపథ్యంలో కరీంనగర్ కాషాయమయం అయ్యింది. ఈ కార్యక్రమంలో అసోం సీఎం హిమంత బిశ్వశర్మతో బండి సంజయ్ పాల్గొననున్నారు. బేగంపేట నుంచి హెలికాప్టర్‌లో కరీంనగర్‌కు వెళ్లనున్నారు హిమంత బిశ్వశర్మ. ఈ నేపథ్యంలోనే అసోం సీఎంకు స్వాగతం పలికేందుకు కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్స్ ఆవరణలో ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి అసోం సీఎంతో కలిసి ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్‌కు వెళ్లనున్నారు బండి సంజయ్. ఇక హిందూ ఏక్తా యాత్ర నేపథ్యంలో కరీంనగర్ వైశ్య భవన్‌కు వేలాదిగా హిందూవాదులు తరలివస్తున్నారు. ఈ కార్యక్రమానికి సుమారు లక్షమంది వాస్తారని కాషాయ నేతల అంచనా చేస్తున్నారు. ఇందులో భాగంగానే భారీ ఏర్పాట్లు చేశారు.