MLC Kavitha : మంచినీళ్లు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం : ఎమ్మెల్సీ కవిత

Update: 2025-02-14 12:45 GMT

రాష్ట్రప్రజలకు కనీసం తాగునీరు ఇవ్వలేని స్థితిలో కాంగ్రెస్ట్రప్రభుత్వం ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. బీఆర్ఎ స్ హయంలో ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందించారని గుర్తు చేశారు. ' రాష్ట్రంలో ఓవైపు విద్యుత్ కోతలతో సాగు నీళ్లు అందక పంటపొలాలు ఎండిపోతున్నాయి.. మరో కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం తాగునీరుకూడా ఇవ్వలేకపోతోంది. ఆలేరు, భువనగిరి, జనగామ నియోజకవర్గా లలో కేసీఆర్ హయాంలో కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలు, ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందించాం. విద్యుత్ సమస్య ఉండొద్దని కేసీఆర్ ప్రభుత్వంలో జిల్లాలో పవర్ ప్లాంటు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాటి ద్వారా సక్రమంగా తాగునీటిని కూడా అందించలేని అసమర్థతలో పడిపోయింది..కేవలం వారు కమీషన్లపై దృష్టి పెట్టడమే. దేవాదుల, కాళేశ్వరం ప్రాజెక్టుల ద్వారా కేసీఆర్ ఈ ప్రాం తాలకు సాగు, తాగునీటి ఏర్పాటు చేశారు. సమ్మక్క సారాలమ్మ 95శాతం పూర్తి చేయగా.. అసంపూర్తి 5శాతం పనులను కాంగ్రెస్ దద్దమ్మ ప్రభుత్వం ఏడాదిగా పూర్తి చేయలేకపోయింది.’ అని కవిత ట్వీట్ చేశారు.

Tags:    

Similar News