KAVITHA: కల్వకుంట్ల కవితపై చర్యలకు రంగం సిద్ధం !

బీ­ఆ­ర్ఎ­స్ గ్రూ­పు నుం­చి కవిత పీ­ఆ­ర్వో అవుట్... కేసీఆర్ కుటుంబంలో ఏదో జరుగుతోంది: కాంగ్రెస్

Update: 2025-09-02 06:30 GMT

తె­లం­గాణ జా­గృ­తి అధ్య­క్షు­రా­లు, ఎమ్మె­ల్సీ కవిత వ్యా­ఖ్య­ల­తో రా­ష్ట్ర రా­జ­కీ­యా­లు ఒక్క­సా­రి హీ­టె­క్కా­యి. కవిత కా­మెం­ట్స్ నే­ప­థ్యం­లో ఎర్ర­వ­ల్లి ఫామ్ హౌ­స్‌­లో బీ­ఆ­ర్ఎ­స్ ము­ఖ్య నే­త­లు భేటీ అయ్యా­రు. ఉదయం నుం­చి ఫా­మ్‌­హౌ­స్‌­లో ఉన్న కే­టీ­ఆ­ర్.. కవిత ప్రె­స్‌­మీ­ట్ తర్వాత సీ­ని­య­ర్ నా­య­కు­లు పల్లా రా­జే­శ్వ­ర్‌­రె­డ్డి, జగ­దీ­శ్‌­రె­డ్డి తది­తర నే­త­లు బీ­ఆ­ర్ఎ­స్ అధి­నేత, మాజీ సీఎం కే­సీ­ఆ­ర్‌­తో చర్చి­స్తు­న్న­ట్లు తె­లు­స్తోం­ది. కవిత వ్యా­ఖ్య­ల­పై బీ­ఆ­ర్‌­ఎ­స్‌ అధి­నేత ఆగ్ర­హం­తో ఉన్న­ట్లు తె­లు­స్తోం­ది. ఈ నే­ప­థ్యం­లో­నే ఆమె­పై చర్య­లు తీ­సు­కుం­టా­రం­టూ పా­ర్టీ­లో జో­రు­గా ప్ర­చా­రం జరు­గు­తోం­ది. కే­సీ­ఆ­ర్ తీ­సు­కు­నే ని­ర్ణ­యం­పై రా­ష్ట్ర రా­జ­కీ­యా­ల్లో ఉత్కంఠ నె­ల­కొం­ది. ఆమె­ను పా­ర్టీ నుం­చి సస్పెం­డ్ చే­సేం­దు­కు రంగం సి­ద్ధ­మై­న­ట్లు పొ­లి­టి­క­ల్ సర్కి­ల్‌­లో గు­స­గు­స­లు వి­ని­పి­స్తు­న్నా­యి. కాగా, కవిత వ్యా­ఖ్యల వల్ల పా­ర్టీ ఇమే­జ్ దె­బ్బ­తిం­టోం­ద­ని, ఆ ప్ర­భా­వం రా­ను­న్న స్థా­నిక సం­స్థల ఎన్ని­క­ల్లో కని­పం­చే అవ­కా­శం ఉం­ద­ని టాక్ నడు­స్తోం­ది. కవిత చే­సిన ఆరో­ప­ణ­లు, పా­ర్టీ లోపల తలె­త్తు­తు­న్న వి­భే­దా­లు బీ­ఆ­ర్ఎ­స్ భవి­ష్య­త్తు­పై ఎలాం­టి వరకు ప్ర­భా­వం చూ­పు­తుం­దో వే­చి­చూ­డా­లి. అయి­తే కవి­త­పై బీ­ఆ­ర్ఎ­స్ వేటు వే­స్తే కొ­త్త పా­ర్టీ పె­ట్టే అవ­కా­శా­లు ఉన్నా­యి.

బీ­ఆ­ర్ఎ­స్ గ్రూ­పు నుం­చి కవిత పీ­ఆ­ర్వో అవుట్

ఎమ్మె­ల్సీ కల్వ­కుం­ట్ల కవి­త­కు బీ­ఆ­ర్ఎ­స్ అధి­ష్టా­నం షా­కి­చ్చిం­ది. కా­ళే­శ్వ­రం అం­శం­లో పా­ర్టీ­పై, ఆ పా­ర్టీ ము­ఖ్య నే­త­లు హరీ­ష్ రావు, సం­తో­ష్ రా­వు­ల­పై ఆమె చే­సిన వ్యా­ఖ్య­ల­పై ఆగ్ర­హం వ్య­క్తం చే­సిం­ది. బీ­ఆ­ర్ఎ­స్ అధి­కా­రిక వా­ట్సా­ప్ గ్రూ­పు నుం­చి ఆమె పీ­ఆ­ర్వో నవీ­న్‌ కు­మా­ర్‌­ను తొ­ల­గిం­చిం­ది. పా­ర్టీ గ్రూ­పు­లో కవి­త­కు సం­బం­ధిం­చిన అన్ని వా­ర్త­ల­ను డి­లీ­ట్ చే­సిం­ది. కవి­త­పై చర్య­లు తీ­సు­కు­నే అవ­కా­శ­మూ ఉన్న­ట్లు రా­జ­కీయ వర్గా­ల్లో గు­స­గు­స­లు వి­ని­పి­స్తు­న్నా­యి. కా­ళే­శ్వ­రం కమి­ష­న్ ని­వే­దిక నే­ప­థ్యం­లో కే­సీ­ఆ­ర్‌­పై సీ­బీఐ ఎం­క్వై­రీ­కి ప్ర­భు­త్వం ని­ర్ణ­యిం­చిన నే­ప­థ్యం­లో కవిత చే­సిన వ్యా­ఖ్య­లు సం­చ­ల­నం రే­పు­తు­న్నా­యి. కే­సీ­ఆ­ర్‌ మీద వి­చా­రణ వే­సిన తర్వాత తొ­క్క­లో పా­ర్టీ ఉంటే ఎంత లే­కుం­టే ఎంత.?అని ఆమె వ్యా­ఖ్యా­నిం­చా­రు. నేను ఇలా మా­ట్లా­డి­తే స్థా­నిక సం­స్థల ఎన్ని­క­ల్లో నష్టం జర­గొ­చ్చ­ని, నష్టం జరి­గి­నా సరే నేను ఇలా­నే మా­ట్లా­డు­తా అంటూ ఆమె ఉద్ఘా­టిం­చా­రు. హరీ­ష్‌­రా­వు, సం­తో­ష్‌­రా­వు దు­ర్మా­ర్గుల వల్లే ఇదం­తా జరి­గిం­ద­న్నా­రు.నే కే­సీ­ఆ­ర్‌­కు ఈ పరి­స్థి­తి వచ్చిం­ద­ని ఆమె సం­చ­లన ఆరో­పణ చే­శా­రు. ఖబ­డ్దా­ర్‌ ఎం­త­వ­ర­కు వె­ళ్లి­నా నేను తే­ల్చు­కుం­టా­న­ని ఆమె ధీమా వ్య­క్తం చే­శా­రు. కే­సీ­ఆ­ర్‌ మీద వి­చా­రణ అంటే తె­లం­గాణ బం­ద్‌­కు పా­ర్టీ ఎం­దు­కు పి­లు­పు­ని­వ్వ­లే­దు.? అని ఆమె ప్ర­శ్నిం­చా­రు.

కేసీఆర్ కుటుంబంలో ఏదో జరుగుతోంది: కాంగ్రెస్

బీ­ఆ­ర్‌­ఎ­స్‌ సీ­ని­య­ర్‌ నేత హరీ­ష్‌­రా­వు­ను టా­ర్గె­ట్‌ చే­స్తూ  ఆ పా­ర్టీ­కి చెం­దిన ఎమ్మె­ల్సీ కవిత చే­సిన ఆరో­ప­ణ­ల­పై కాం­గ్రె­స్‌ ఎమ్మె­ల్సీ అద్దం­కి దయా­క­ర్‌ సె­టై­ర్లు వే­శా­రు. తా­జా­గా కవిత చే­సిన వ్యా­ఖ్య­ల­తో కే­సీ­ఆ­ర్‌ కు­టుం­బం­లో ఏదో జరు­గు­తోం­దం­టూ వ్యం­గ్య­స్త్రా­లు సం­ధిం­చా­రు. హరీ­ష్‌­పై కవిత సంచల వ్యా­ఖ్యల నే­ప­థ్యం­లో స్పం­దిం­చిన అద్దం­కి దయా­క­ర్‌.. ‘ కా­ళే­శ్వ­రం ప్రా­జె­క్టు వి­ష­యం­లో అవి­నీ­తి జరి­గిం­ద­ని స్ప­ష్ట­మైం­ది. కే­సీ­ఆ­ర్‌ కు­టుం­బం­లో  ఏదో జరు­గు­తోం­ది. మొ­న్న కే­టీ­ఆ­ర్‌­ను టా­ర్గె­ట్‌ చే­సిన కవిత.. ఇప్పు­డు హరీ­ష్‌­ను టా­ర్గె­ట్‌ చే­య­డం వె­నుక ఏదో ఉంది. కే­టీ­ఆ­ర్‌, హరీ­ష్‌, కవి­తల మధ్య ఏదో పం­చా­యి­తీ ఉంది’ అంటూ అని పే­ర్కొ­న్నా­రు. మా­నా­న్న­కు తిం­డి మీద,డబ్బు మీద యావ ఉం­డ­దు. తర­త­త­రాల తర­గ­ని ఆస్తి­ని కే­సీ­ఆ­ర్‌ తె­లం­గాణ ప్ర­జ­ల­కు ఇచ్చా­రు. కే­సీ­ఆ­ర్‌ పక్కన ఉన్న వా­ళ్ల­లో ఉన్న కొం­త­మం­ది వల్లే ఇలా జరి­గిం­ది. ఇదం­తా హరీ­ష్‌ వల్లే జరి­గిం­ది. కే­సీ­ఆ­ర్‌­కు అవి­నీ­తి మరక ఎలా వచ్చిం­దో చూ­డా­లి. కే­సీ­ఆ­ర్‌ మీద వి­చా­రణ తర్వాత బీ­ఆ­ర్‌­ఎ­స్‌ ఉంటే ఎంత పోతే ఎంత అంటూ వ్యా­ఖ్యా­నిం­చా­రు. 

Tags:    

Similar News