KAVITHA: నాపై కక్ష కట్టారు.. నన్ను వేధిస్తున్నారు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరో లేఖాస్త్రం.. టీబీజీకేఎస్‌ పదవి తొలగించడపై ఆగ్రహం.. తనను వారే వేధిస్తున్నారని కవిత ఆరోపణలు;

Update: 2025-08-22 02:30 GMT

తె­లం­గాణ జా­గృ­తి అధ్య­క్షు­రా­లు, బీ­ఆ­ర్‌­ఎ­స్ ఎమ్మె­ల్సీ కల్వ­కుం­ట్ల కవి­త­కు పా­ర్టీ అధి­ష్టా­నం షాక్ ఇచ్చిం­ది. తె­లం­గాణ బొ­గ్గు గని కా­ర్మిక సంఘం (TBGKS) గౌరవ అధ్య­క్షు­రా­లి పదవి నుం­చి ఆమె­ను తొ­ల­గిం­చి.. ఆ స్థా­నం­లో మాజీ మం­త్రి కొ­ప్పుల ఈశ్వ­ర్‌­ను ఏక­గ్రీ­వం­గా ని­య­మిం­చిం­ది. ఈ పరి­ణా­మం రా­ష్ట్ర రా­జ­కీ­యా­ల్లో హాట్ టా­పి­క్‌­గా మా­రిం­ది. ఈ వి­ష­యం­పై స్పం­దిం­చిన కల్వ­కుం­ట్ల కవిత.. సిం­గ­రే­ణి కా­ర్మి­కు­ల­కు బహి­రంగ లేఖ రా­శా­రు. తనను గౌరవ అధ్య­క్షు­రా­లి పదవి నుం­చి తొ­ల­గిం­చ­డం వె­నుక రా­జ­కీయ కా­ర­ణా­లు ఉన్నా­య­ని కవిత ఆరో­పిం­చా­రు. కా­ర్మిక చట్టా­ల­కు వి­రు­ద్ధం­గా పా­ర్టీ కా­ర్యా­ల­యం­లో ఈ ఎన్నిక ని­ర్వ­హిం­చా­ర­ని, సాం­కే­తి­కం­గా ఇది తప్పు అని పే­ర్కొ­న్నా­రు. టీ­బీ­జీ­కే­ఎ­స్‌ గౌరవ అధ్య­క్షు­రా­లి­గా పదే­ళ్ల పాటు కా­ర్మి­కు­ల­కు సే­వ­లు అం­దిం­చే అవ­కా­శం లభిం­చ­డం తన అదృ­ష్టం­గా భా­వి­స్తు­న్నా­న­ని ఆమె తె­లి­పా­రు. అదే సమ­యం­లో కొ­త్త­గా ఎన్ని­కైన కొ­ప్పుల ఈశ్వ­ర్‌­కు శు­భా­కాం­క్ష­లు తె­లి­పా­రు. తె­లం­గాణ ఉద్య­మం­లో సిం­గ­రే­ణి కా­ర్మి­కు­ల­ను ఏక­తా­టి­పై­కి తె­చ్చి పో­రా­టం­లో భా­గ­స్వా­ము­ల­ను చే­య­డం­లో తాను ముం­దుం­డి పని చే­శా­న­ని కవిత గు­ర్తు చే­సు­కు­న్నా­రు.

నాపై కక్ష కట్టారు

పా­ర్టీ­లో జరు­గు­తు­న్న అం­త­ర్గత పరి­ణా­మా­ల­ను తాను ప్ర­శ్నిం­చ­డం వల్లే తనపై కక్ష­గ­ట్టా­ర­ని కవిత పే­ర్కొ­న్నా­రు. కే­సీ­ఆ­ర్‌­కు రా­సిన లేఖ లీక్ చే­సిన కు­ట్ర­దా­రు­లు ఎవరో బయ­ట­పె­ట్టా­ల­ని తాను కో­రి­నం­దు­కు తనను వే­ధిం­పు­ల­కు గురి చే­స్తు­న్నా­ర­ని ఆమె ఆరో­పిం­చా­రు. గౌరవ అధ్య­క్షు­రా­లి­గా ఉన్నా లే­క­పో­యి­నా.. కా­ర్మి­కుల కు­టుం­బం­లో ఒక సభ్యు­రా­లి­గా ఎల్ల­ప్పు­డూ అం­డ­గా ఉం­టా­న­ని కవిత హామీ ఇచ్చా­రు. తన పద­వీ­కా­లం­లో కా­ర్మి­కుల కోసం చే­సిన కృ­షి­ని కవిత వి­వ­రిం­చా­రు. ఉమ్మ­డి రా­ష్ట్రం­లో ని­లి­పి­వే­సిన డి­పెం­డెం­ట్ ఉద్యో­గా­ల­ను కే­సీ­ఆ­ర్‌­ను ఒప్పిం­చి తి­రి­గి కా­రు­ణ్య ని­యా­మ­కాల పే­రు­తో పు­న­రు­ద్ధ­రిం­చా­న­ని తె­లి­పా­రు. తద్వా­రా 19,463 మంది యు­వ­త­కు ఉద్యో­గా­లు లభిం­చా­య­ని సం­తో­షం వ్య­క్తం చే­శా­రు. సకల జనుల సమ్మె­లో పా­ల్గొ­న్న కా­ర్మి­కు­ల­కు ప్ర­భు­త్వ ఉద్యో­గు­ల­తో సమా­నం­గా తె­లం­గాణ ఇం­క్రి­మెం­ట్‌ ఇప్పిం­చా­న­ని చె­ప్పా­రు. కా­ర్పొ­రే­ట్‌ వై­ద్య సదు­పా­యా­లు వంటి అనేక పథ­కా­ల­ను అమలు చే­య­డం­లో క్రి­యా­శీ­లం­గా పని చే­శా­న­ని ఆమె వి­వ­రిం­చా­రు.

Tags:    

Similar News