KAVITHA: రాజకీయాల్లో తొక్కుకుంటూ పోవాల్సిందే

మరోసారి ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు... కాంగ్రెస్‌లో చేరేదే లేదని స్పష్టం చేసిన కవిత... హస్తం నేతలు తనను సంప్రదించేలేదని వెల్లడి...

Update: 2025-09-21 03:00 GMT

కొ­త్త పా­ర్టీ పె­ట్టా­లా లేదా అనే దా­ని­పై ఎలాం­టి ని­ర్ణ­యం తీ­సు­కో­లే­ద­ని ఎమ్మె­ల్సీ కవిత స్ప­ష్టత ఇచ్చా­రు. పా­ర్టీ పె­ట్టే­ముం­దు కే­సీ­ఆ­ర్ వందల మం­ది­తో చర్చ­లు జరి­పా­రు. ప్ర­స్తు­తం నేనూ అదే చే­స్తు­న్నా­ను అని వె­ల్ల­డిం­చా­రు. హై­ద­రా­బా­ద్‌­లో ని­ర్వ­హిం­చిన మీ­డి­యా సమా­వే­శం­లో ఆమె మా­ట్లా­డా­రు. రా­జ­కీ­యా­ల్లో ఎవరూ స్పే­స్‌ ఇవ్వ­ర­ని.. తొ­క్కు­కుం­టూ వె­ళ్లా­ల్సిం­దే­న­ని కవిత వె­ల్ల­డిం­చా­రు. కాం­గ్రె­స్‌ పె­ద్ద­లు ఎవరూ తనను సం­ప్ర­దిం­చ­లే­ద­ని తే­ల్చి చె­ప్పా­రు.

 అంతా హరీశే చేశారు

కా­ళే­శ్వ­రం వి­ష­యం­లో ప్ర­తి ని­ర్ణ­యం కే­సీ­ఆ­ర్ దే­న­ని హరీ­ష్ రావు పీసీ ఘోష్ కమి­ష­న్ కు చె­ప్పా­రు.. హరీ­ష్ రా­వు­పై కా­ళే­శ్వ­రం వి­ష­యం­లో తప్ప నాకు వేరే కోపం లేదు అని వె­ల్ల­డిం­చా­రు. కాం­గ్రె­స్ పా­ర్టీ­లో చేరే ఆలో­చన నాకు లే­ద­ని అన్నా­రు. కాం­గ్రె­స్ పె­ద్ద­లు ఎవరూ నాకు ఫోన్ చే­య­లే­దు.. నేను కాం­గ్రె­స్ లో ఎవ­ర్నీ అప్రో­చ్ కా­లే­దు­ని స్ప­ష్టం చే­శా­రు. :"సీఎం రే­వం­త్ .. పదే పదే నా­పే­రు ఎం­దు­కు తీ­సు­కుం­టు­న్నా­రో తె­లి­య­దు.. ము­ఖ్య­మం­త్రి కాం­గ్రె­స్ నుం­చి బయ­ట­కు పో­తు­న్నా­డే­మో? అని తె­లి­పా­రు. ఒక వర్గం కోసం కాదు.. ప్ర­జ­లం­ద­రి కోసం పని­చే­యా­ల­ను­కుం­టు­న్న.. బీసీ ఇష్యూ నా మన­స్సు­కు దగ్గ­ర­గా అని­పిం­చిం­ద­ని తె­లి­పా­రు. ప్ర­స్తు­తం ఫ్రీ బర్డ్ .. నా ద్వా­రా­లు తె­లి­చే ఉన్నా­యి.. చా­లా­మం­ది వచ్చి నన్ను కలు­స్తు­న్నా­రు.. నాతో టచ్ లో ఉన్న బీ­ఆ­ర్ఎ­స్ నేతల లి­స్ట్ చాలా పె­ద్ద­ది" అని కవిత సం­చ­లన వ్యా­ఖ్య­లు చే­శా­రు.

బీఆర్ఎస్ దాడి చేస్తోంది

" నాపై బీ­ఆ­ర్‌­ఎ­స్‌ సో­ష­ల్‌ మీ­డి­యా దాడి చే­స్తోం­ది. బీ­ఆ­ర్ఎ­స్‌­లో అం­ద­రూ నన్ను ఇబ్బం­దు­లు పె­ట్టా­ర­ని తె­లం­గాణ ప్ర­జ­లు భా­వి­స్తు­న్నా­రు. నా రా­జీ­నా­మా­ను స్పీ­క­ర్ ఫా­ర్మా­ట్‌­లో ఇచ్చా­ను. స్పీ­క­ర్‌­కు ఫోన్ చేసి కూడా ఆమో­దిం­చ­మ­ని అడి­గా­ను. అవ­స­ర­మై­తే మళ్ళీ రా­జీ­నా­మా లే­ఖ­ను పం­పి­స్తా­ను. తె­లం­గా­ణ­లో కొ­త్త రా­జ­కీయ పా­ర్టీ­లు వస్తే స్వా­గ­తి­స్తా­ను. తం­డ్రి పా­ర్టీ నుం­చి సస్పెం­డ్‌ అయిన మొ­ద­టి కూ­తు­ర్ని నేనే." అని కవిత అన్నా­రు. "మళ్లీ అధి­కా­రం­లో­కి వచ్చే అర్హత కాం­గ్రె­స్‌­కు లేదు. నాకు కాం­గ్రె­స్‌­లో చే­రా­ల­నే ఆలో­చ­నే లేదు. కాం­గ్రె­స్‌ పె­ద్ద­లు ఎవరూ నన్ను సం­ప్ర­దిం­చ­లే­దు. అం­ద­రం కలి­సి బీసీ రి­జ­ర్వే­ష­న్ల కోసం పో­రా­టం చే­యా­లి. బీసీ రి­జ­ర్వే­ష­న్ల­ను సా­ధిం­చు­కో­వా­లి. బీ­సీల కోసం కో­ట్లా­డు­తు­న్నాం.. ముం­దు రి­జ­ర్వే­ష­న్ల­ను సా­ధిం­చు­కుం­దాం. సు­ప్రీం­కో­ర్టు స్టే ఉన్న­ప్ప­టి­కీ ఆల్మ­ట్టి ఆన­క­ట్ట ఎత్తు పెం­చేం­దు­కు కర్ణా­టక సి­ద్ధ­మైం­ది. ఆల్మ­ట్టి­పై రా­ష్ట్ర ప్ర­భు­త్వం వెం­ట­నే సు­ప్రీం­కో­ర్టు­కు వె­ళ్లా­లి. ప్ర­భు­త్వం వె­ళ్ల­కుం­టే జా­గృ­తి తర­ఫున సు­ప్రీం­కో­ర్టు­ను ఆశ్ర­యి­స్తాం.’ అని ఘాటు వి­మ­ర్శ­లు చే­శా­రు.

Tags:    

Similar News