KCR : సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ దసరా కానుక..
KCR : 2021- 22 సంవత్సరంలో సాధించిన లాభాల్లో 30 శాతం వాటా కార్మికులకు ఇవ్వాలని నిర్ణయించారు సీఎం కేసీఆర్;
KCR : సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ దసరా కానుక ప్రకటించారు. 2021- 22 సంవత్సరంలో సాధించిన లాభాల్లో 30 శాతం వాటా ఇవ్వాలని నిర్ణయించారు. దసరాలోపు కార్మికులకు ప్రత్యేక ప్రోత్సాహం చెల్లించాలని సింగరేణి యజమాన్యాన్ని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
ఈ మేరకు సింగరేణి ఛైర్మన్, మేనేజింగ్ డైరక్టర్‌కు.. సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగరావు ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో.. అర్హులైన కార్మికులకు 368 కోట్ల రూపాయలు చెల్లించనుంది సింగరేణి యాజమాన్యం. సింగరేణి సంస్థ లాభాల్లో వాటాను కార్మికులకు దసరా కానుకగా ఇస్తుండటం కొత్తేమి కాదు.
2020లో సంస్థ లాభాల్లో 28 శాతం వాటను కార్మికులను దసరా కానుగా ఇచ్చారు. 2021లో దాన్ని 29 శాతానికి పెంచారు. ఈ ఏడాది... ఒక శాతం పెంచి 30 శాతం వాటాను ఇవ్వనున్నారు.