బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనకు ఫోన్ చేశారని, మళ్లీ కలిసి పనిద్దామని పిలుపునిచ్చారని జరుగుతున్న ప్రచారాన్ని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎంపీ ఈటల రాజేందర్ ఖండించారు. 'నేనంటే గిట్టని వారు, సైకోలు, శాడి స్టులు చేసే ప్రచారం తప్ప.. ఇందులో ఎలాంటి నిజం 'లేదు' అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్, కేసీఆర్ విష యంలో చాలా కాలంగా తన స్టాండ్ ఏంటో చెబుతూనే ఉన్నానని, అయినా ఎందుకు ఇలా దుష్ప్రచారం చేస్తున్నారోనని వాపోయారు. ఇదంతా బాధ్యత లేని వ్యక్తులు సోషల్ మీడియాలో శాడిజంతో చేసే ప్రచారమని మండిపడ్డారు.