Rajbhavan KCR : ఎట్ హోం కార్యక్రమానికి హాజరుకాని సీఎం కేసీఆర్.. గవర్నర్ మళ్లీ సీరియస్

Rajbhavan KCR : ప్రగతి భవన్‌కు, రాజ్ భవన్‌కు మధ్య గ్యాప్ మరింత పెరిగింది.

Update: 2022-08-15 16:23 GMT

Rajbhavan KCR : ప్రగతి భవన్‌కు, రాజ్ భవన్‌కు మధ్య గ్యాప్ మరింత పెరిగింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో గవర్నర్ ఏర్పాటు చేసిన ఎట్ హోమ్ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరు కాలేదు. చివరి నిమిషంలో కార్యక్రమాన్ని రద్దుచేసుకున్నారు సీఎం. అటు మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం ఎవరూ వేడుకకు హాజరు కాలేదు. ప్రభుత్వం తరఫున సీఎస్ సోమేశ్‌కుమార్ ఒక్కరే కార్యక్రమానికి హాజరయ్యారు.

ఎట్ హోం కార్యక్రమానికి సీఎం వస్తారని సమాచారం ఇచ్చారని అన్నారు గవర్నర్ తమిళిసై. అయితే ఎందుకు రాలేదో తనకు తెలియదన్నారు. రాలేనందుకు సమాచారం కూడా ఇవ్వలేదని అన్నారు. సీఎం కేసీఆర్ వస్తారన్నారనే ఎట్ హోం కార్యక్రమాన్ని ఆలస్యంగా ప్రారంభించామన్నారు. ఇక తెలంగాణ యువతను, ప్రజలనుద్దేశించిన ఆమె ప్రసంగించారు.

ఏడాదిన్నరగా రాజ్‌భవన్, ప్రగతిభవన్‌ల మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. ప్రోటోకాల్ విషయంలో గవర్నర్ తమిళిసై పలుమార్లు సర్కారుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మధ్య కూడా బాసర టూర్‌లో ప్రోటోకాల్ పాటించట్లేదంటూ ఫైర్ అయ్యారు. ప్రభుత్వ పథకాల పనితీరుపై కూడా హాట్ కామెంట్స్ చేశారు. అటు TRS సైతం గవర్నర్‌పై ఎదురు దాడికి దిగింది. బీజేపీ కార్యకర్తలా మాట్లాడుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు గులాబీ లీడర్లు.

ఈ పరిణామాల నేపథ్యంలో ఏడాదిన్నరగా రాజ్ భవన్‌లో కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు సీఎం కేసీఆర్. చివరగా హైకోర్టు చీఫ్ జస్టిస్ భుయాన్ ప్రమాణ స్వీకారానికి వెళ్లినప్పటికీ.... ప్రోటోకాల్ పాటించేందుకే హాజరయ్యారనే చర్చ జరిగింది. తాజాగా ఎట్‌ హోం కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరు కాకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. రాజ్ భవన్‌కు, ప్రగతి భవన్‌కు మధ్య దూరం మరింత పెరిగందనే చర్చ జరుగుతోంది.

Tags:    

Similar News