బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనారోగ్య బారిన పడినట్లు తెలుస్తోంది. ఆయన సీజనల్ ఫీవర్ తో బాధపడుతున్నట్లు సమాచారం. వైద్య పరీక్షల కోసం యశోద ఆస్పత్రికి వెళ్లారు. కేసీఆర్‌కు డాక్టర్లు వివిధ రకాల టెస్టులు చేస్తున్నారు. ఆయన వెంట సతీమణి శోభ, కేటీఆర్, హరీశ్‌రావు, సంతోష్ ఉన్నారు. గతంలోనూ కేసీఆర్ యశోద ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు.