బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనారోగ్యానికి గురయ్యారు. ఆయన సీజనల్ ఫీవర్ తో బాధపడుతున్నట్లు సమాచారం. దీంతో కుటుంబసభ్యులు ఆయన్ని యశోద ఆస్పత్రిలో చేర్చారు. ఈ నేపథ్యంలో వైద్యులు ఆయనకు వివిధ పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని.. ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. దీనికి సంబంధించి హెల్ల్ బులిటెన్ విడుదల చేశారు.
‘‘కేసీఆర్ నీరసంగా ఉండటంతో సాయంత్రం ఆస్పత్రిలో చేరారు. ఆయన శరీరంలో బ్లడ్ షుగర్ అధికంగా, సోడియం మోతాదు తక్కువగా ఉన్నట్లు గుర్తించాం. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. చికిత్స కొనసాగుతోంది’’ అని హెల్త్ బులిటెన్ లో వివరించారు. కాగా కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఆయన త్వరగా కోలుకోవాలని.. సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని సీఎం ఆకాంక్షించారు.