KCR : బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ భేటీ.. వాటిపై చర్చ..

Update: 2025-08-11 15:00 GMT

పార్టీ ముఖ్య నేతలతో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో జరుగుతున్న ఈ భేటీలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ తదితరులు ఉన్నారు. ఈ నెల 14న కరీంనగర్ లో బీసీ గర్జన సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపైనే ప్రధానంగా చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. కాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో ధర్నా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ అంశంలో బీజేపీ రాష్ట్రపతిని కలవకుండా అడ్డుకుంటోందని అందుకు బీఆర్ఎస్ పార్టీ సహకరిస్తుందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ అంశం పై అధికార పక్షాన్ని కార్నర్ చేసేందుకు కరీంనగర్ వేదికగా బీసీ సభకు ప్లాన్ చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ. ఈ నెల 8 నే సభ ప్రకటించినప్పటికీ 14 కు మారుస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ విమర్శలకు సభా వేదికగా కేసీఆర్ కౌంటర్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News