KCR: ప్రధాని హైదరాబాద్ పర్యటనకు కేసీఆర్ దూరం...
KCR: మధ్యాహ్నం ఒంటిగంట వరకు అంతా ఇదే రకంగా భావించారు. కానీ అంతలోనే సీఎం కేసీఆర్ ట్విస్ట్ ఇచ్చారు;
KCR: ప్రధానమంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ పర్యటనలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. మోదీ పర్యటనకు సీఎం కేసీఆర్ దూరం కానున్నారు. కాసేపట్లో మోదీ శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోనుండగా.. ఇప్పటికీ కేసీఆర్ అక్కడికి చేరుకోకపోవడంతో.. ఈ విషయం రూఢీ అయింది. ఈ విషయంలో నిన్నటి నుంచి ఊహాగానాలు, సందిగ్ధాలు నడుస్తున్నాయి.
ప్రధానికి స్వాగతం పలికేందుకు కేసీఆర్ వెళ్లడం లేదని... ఆ బాధ్యతను మంత్రి తలసానికి అప్పగించినట్లు నిన్న మధ్యాహ్నం వార్తలు వచ్చాయి. ఈ మేరకు ఓ అధికార పత్రం కూడా సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. అయితే రాత్రి వరకు పరిస్థితి మారింది.
కేసీఆర్ మోదీ టూర్‌కు హాజరవుతారని ప్రచారం జరిగింది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు అంతా ఇదే రకంగా భావించారు. కానీ అంతలోనే సీఎం కేసీఆర్ ట్విస్ట్ ఇచ్చారు. ఆయన మోదీ పర్యటనకు హాజరు కావడం లేదంటూ వెల్లడైంది.