నేటి నుంచే రెండో విడత న్యూట్రీషన్ కిట్ల పంపిణీ
గర్భిణుల్లో పోష్టికాహార లోపం, రక్తహీనత నివారించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేస్తోంది;
గర్భిణుల్లో పోష్టికాహార లోపం, రక్తహీనత నివారించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేస్తోంది. ఇప్పటికే తొలి విడతలో పలు జిల్లాల్లో గర్భిణులకు అందజేసింది. రెండో విడతలో రాష్ట్రవ్యాప్తంగా గర్భిణులకు కిట్లను అందజేయనున్నారు. రెండో విడుత న్యూట్రిషన్ల కిట్ల పంపిణీకి సీఎం కేసీఆర్ ఇవాళ శ్రీకారం చుట్టనున్నారు. హైదరాబాద్ నిమ్స్‌లో జరిగే కార్యక్రమంలో ఆరుగురు గర్భిణులకు ముఖ్యమంత్రి కేసీఆర్ కిట్లను అందజేయనున్నారు. అయితే.., తొలి దశలో ఆదిలాబాద్, కొత్తగూడెం, భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్, ములుగు, నాగర్‌కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో కిట్లను పంపిణీ చేశారు. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనున్నారు. కాగా.. ఈ కిట్‌లో ఏడు రకాల వస్తువులుంటాయి.