KCR: జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు ముందుకుసాగుతున్నా: కేసీఆర్
KCR: దేశం బాగుండాలంటే కేంద్రంలో ధర్మంతో పని చేసే ప్రభుత్వం ఉండాలన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.;
KCR: దేశం బాగుండాలంటే కేంద్రంలో ధర్మంతో పని చేసే ప్రభుత్వం ఉండాలన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. పరిస్థితులను అవగాహన చేసుకుని దేశాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రభుత్వం కేంద్రంలో ఉండాలన్నారు. కులాలు, మతాల పేరు మీద చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. ప్రశాంతంగా ఉన్నచోటుకే పెట్టుబడులు వస్తాయన్నారు. మతాలు, కులాల పేరుతో చిచ్చు దేశానికి ప్రమాదమన్నారు. జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే విధంగా ముందుకుసాగుతున్నానని చెప్పారు. ఇందుకోసం సర్వశక్తులు ఒడ్డుతానన్నారు.