CM Revanth Reddy : కేసీఆర్ సంతకమే తెలంగాణకు శాపంగా మారింది - సీఎం

Update: 2025-07-02 05:13 GMT

బనకచర్ల అంశంపై బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులపై సీఎం రేవంత్ నిప్పులు చెరిగారు. కేసీఆర్, హరీశ్ సంతకాలే తెలంగాణకు శాపంగా మారాయని చెప్పారు. ఇవాళ ప్రజాభవన్‌లో గోదావరి-బనకచర్లపై ప్రభుత్వం పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ జలాల విషయంలో రాజీపడేది లేదని తేల్చి చెప్పారు. రాష్ట్ర నీటిహక్కుల విషయంలో అన్ని విధాల పోరాడతామని చెప్పారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు తీరని నష్టం చేసిందని రేవంత్ మండిపడ్డారు. 811 టీఎంసీల్లో రాష్ట్రానికి 299 టీఎంసీలు మాత్రమే చాలని సంతకాలు చేశారని విమర్శించారు. 2015లో చేసిన ఆ సంతకాలే తెలంగాణకు మరణశాసనంగా మారాయన్నారు. కృష్ణా పరివాహక ప్రాంతం పరంగా చూస్తే తెలంగాణకే ఎక్కువ నీరు దక్కాలన్న సీఎం.. ప్రాజెక్టులు కంప్లీట్ కాకపోవడంతో రాష్ట్రానికి కేటాయించిన 299 టీఎంసీలు కూడా వాడుకోలేని స్థితి వచ్చిందన్నారు. ఏపీ మాత్రం పూర్తిచేసుకున్న ప్రాజెక్టులకు నీటిని తరలించుకుపోతోందన్నారు.

జగన్‌ అధికారంలో ఉన్నప్పుడు ఏపీ ప్రాజెక్టులపై కేసీఆర్‌, హరీశ్‌రావు నోరుమెదపలేదని రేవంత్ అన్నారు. చంద్రబాబు సీఎం కాగానే జలాల సెంటిమెంట్‌తో రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. నీటి కేటాయింపులపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఎందుకు మాట్లాడట్లేదని సీఎం ప్రశ్నించారు. చావుబతుకుల్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీని బతికించాలని బీజేపీ నేతలు తాపత్రయపడుతున్నారని విమర్శించారు. కమీషన్లకు కక్కుర్తిపడి రూ. లక్షల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని రేవంత్ మండిపడ్డారు.

Tags:    

Similar News