KCR Rakhi : రాఖీ కట్టించుకొని ఆశీర్వాదం తీసుకున్న సీఎం కేసీఆర్..
KCR Rakhi : రక్షా బంధన్ వేడుకలు ముఖ్యమంత్రికేసీ ఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్లో... ఘనంగా జరిగాయి;
KCR Rakhi : రక్షా బంధన్ వేడుకలు ముఖ్యమంత్రికేసీ ఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్లో... ఘనంగా జరిగాయి. సీఎం సోదరీమణులు రాకతో వారి ఇళ్లు సందడిగా మారింది. ఇంటికి వచ్చిన వారిని కేసీఆర్ సతీమణి శోభమ్మ సాధరంగా, సాంప్రదాయ బద్దంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన సోదరీమణులు లలితమ్మ, లక్ష్మమ్మ, జయమ్మ, చెల్లెలు వినోదమ్మలు రాఖీ కట్టారు. రక్షకట్టిన తోబుట్టువులకు కేసీఆర్ పాదాలకు నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. రక్షాబంధన్ వేడుకల్లో మంత్రి కేటీఆర్ సతీమణి శైలిమ, కుమారుడు, కుమార్తె కూడా పాల్గొని పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు.