TG : మోటు మాటలు నేర్పిందే కేసీఆర్.. కేటీఆర్‌పై కోమటిరెడ్డి విసుర్లు

Update: 2024-09-16 15:45 GMT

రాజీవ్ గాంధీ గురించి మాట్లాడే కనీస అర్హత కేటీఆర్ కు లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నల్లగొండలో మాట్లాడిన కోమటిరెడ్డి.. సెక్రటేరియట్ ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే తప్పేముందని ప్రశ్నించారు. దేశానికి ప్రధానిగా సేవలందించిన ఆ మహా నాయకుడు నేటికీ జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని చెప్పారు.

ఇండియాలో సాంకేతిక విప్లవానికి బాటలు వేసిన వ్యక్తి రాజీవ్ గాంధీ అని గుర్తుచేశారు కోమటిరెడ్డి. అలాంటి వ్యక్తి పట్ల అనుచితంగా మాట్లాడితే ఇక నుంచి ఏ మాత్రం సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. మరో పదేళ్ల పాటు రాష్ట్రంలో తామే అధికారంలో ఉంటామని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ నాయకులు తమను ఒక్క మాట అంటే అందుకు రెండు రెట్ల మాటలతో సమాధానమిస్తామని చెప్పారు.

తెలంగాణ రాజకీయాల్లో పరుష భాషను నేర్పింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు కోమటిరెడ్డి. హరీశ్ రావు, కేటీఆర్ ను తాము లెక్కలోకి తీసుకోవడం లేదని ఎద్దేవా చేశారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు పెట్టలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు

Tags:    

Similar News