రెండేళ్ల మౌనం తర్వాత మాజీ సీఎం కేసీఆర్ ప్రజల్లోకి వస్తున్నారు. ఇకనుంచి పూర్తిస్థాయిలో ప్రజల మధ్యనే ఉండబోతున్నారు. వరుసగా తన గలాన్ని వినిపించడానికి భారీగానే వ్యూహాలు రెడీ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రీసెంట్ గా మాట్లాడుతూ తాను ఉన్నంతకాలం గులాబీ పార్టీని మరోసారి అధికారంలోకి రానివ్వబోనని శపథం చేశారు. ఆయన ఛాలెంజ్ తో కెసిఆర్ అండ్ టీం అలర్ట్ అయింది. ఇకనుంచి ప్రజల్లోనే ఉండాలని కెసిఆర్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే కొత్త ఏడాది నుంచి తన ప్రయాణాన్ని మొదలుపెట్టబోతున్నారు కేసీఆర్. ముందుగా మూడు భారీ బహిరంగ సభలు ప్లాన్ చేస్తున్నారు.
అందులో మొదటిది ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే పెట్టాలని గులాబీ బాస్ డిసైడ్ అయ్యారు. అయితే కొడంగల్ లోనే మొదటి సభ పెట్టాలని పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అక్కడినుంచే రేవంత్ ను టార్గెట్ చేయాలని అంటున్నారు. ఇక రెండో సభ నల్గొండ జిల్లాలో, మూడో సభ రంగారెడ్డి జిల్లాలో పెట్టబోతున్నారు. ఈ మూడు సభలు కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఏరియాలోనే ఉండబోతున్నాయి. మరీ ముఖ్యంగా జలదోపిడి మీదనే కేసీఆర్ గళం విప్పబోతున్నారు. ఈ మూడు భారీ బహిరంగ సభల ద్వారా రేవంత్ రెడ్డిని మరోసారి అధికారంలోకి రానివ్వబోనని కేసీఆర్ ఛాలెంజ్ విసరబోతున్నారు.
వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గులాబీ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా కేసీఆర్ ప్రజల్లోకి వస్తున్నారు. అంతేకాకుండా కెసిఆర్ తన హెల్త్ మీద ప్రజల్లో ఏర్పడిన అపోహలను తొలగించడంతోపాటు తన పవర్ ఇంకా తగ్గలేదని నిరూపించుకోవాలని చూస్తున్నారు. రాబోయే జెడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికలే లక్ష్యంగా కేసిఆర్ ఈ భారీ బహిరంగ సభలు పెడుతున్నారు. ఇకనుంచి వచ్చే ప్రతి ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి ఎక్కువ సీట్లు సాధించి గ్రౌండ్ లెవెల్ నుంచే బలం పెంచేసుకొని వచ్చే ఎన్నికల్లో ఈజీగా భారీ మెజార్టీతో గెలవాలని కేసీఆర్ చూస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అక్రమాలు, భూ దందాలు, ఫ్యూచర్ సిటీ అంటూ కుంభకోణానికి తెరతీస్తున్నారు అంటున్నారు కెసిఆర్. వీటన్నింటినీ ప్రజలకు వివరించి కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకురావాలని లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు గులాబీ బాస్.