తెలంగాణ బీజేపీ నేత, ఎంపీ లక్ష్మణు జాతీయ స్థాయిలో ప్రధాన బాధ్యతలను పార్టీ అప్పగించింది. యూపీ, హర్యానాలోనూ కీలకంగా వ్యవహరించారు. తాజాగా మరోసారి ఆయనకు కీలక బాధ్యతలు లభించాయి. పార్టీ సంస్థాగత ఎన్నికల నిర్వహణ ప్రధాన రిటర్నింగ్ ఆఫీసర్ గా కే లక్ష్మణ్ ను నియమిస్తూ బీజేపీ ప్రకటనను వెల్లడించింది. లక్ష్మణకు సహాయ రిటర్నింగ్ ఆఫీసర్లుగా మరో ముగ్గురు పార్టీ నేతలను నియమించారు. కో రిటర్నింగ్ ఆఫీసర్స్ గా ఎంపీలు నరేష్ బన్సల్, సంబిత్ పాత్ర, జాతీయ ఉపాధ్యక్షురాలు రేఖా వర్మకు చోటు దక్కింది. లక్ష్మణ్ ఇప్పటికే ఓబీసీ జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు. యూపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్న ఆయనకు అగ్రనాయకత్వం కీలక బాధ్యతలను అప్పగిస్తూ ముందుకు వెళ్తోంది.