Khairatabad Ganesh: ఖైరతాబాద్ పంచముఖ మహాలక్ష్మి గణపతి.. నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి..

KHAIRATHABAD GANESH: ఖైరతాబాద్ వినాయకుని శోభాయాత్ర కాసేపట్లో మొదలవనుంది. ఖైరతాబాద్‌ గణేష్‌తో పాటు ఇరువైపులా ఏర్పాటు చేసిన త్రిశక్తి మహాగాయత్రి, షణ్ముఖ సుబ్రమణ్యం స్వామి శోభాయాత్రకు మొత్తం మూడు ట్రక్కులు ఏర్పాటు చేశారు.;

Update: 2022-09-09 06:16 GMT

Khairatabad Ganesh: ఖైరతాబాద్ వినాయకుని శోభాయాత్ర కాసేపట్లో మొదలవనుంది. ఖైరతాబాద్‌ గణేష్‌తో పాటు ఇరువైపులా ఏర్పాటు చేసిన త్రిశక్తి మహాగాయత్రి, షణ్ముఖ సుబ్రమణ్య స్వామి శోభాయాత్రకు మొత్తం మూడు ట్రక్కులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఖైరతాబాద్ గణేష్ ఇరువైపులా ఏర్పాటు చేసిన విగ్రహాలను రెండు ట్రక్కులపైకి ఎక్కించారు. రాత్రి 11 గంటలకు కలశ పూజ చేసిన నిర్వాహకులు.. అర్ధరాత్రి 12 గంటలకు ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని కదిలించారు.

మరోవైపు ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర చేసే ట్రక్ వెల్డింగ్‌ పనులను పూర్తి చేశారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. 68 ఏళ్ల ఖైరతాబాద్ గణేష్ చరిత్రలో తొలిసారిగా 50 అడుగుల మట్టి గణపతిని తయారు చేశారు. ఈసారి పంచముఖ మహాలక్ష్మి గణపతిగా దర్శనం ఇచ్చారు ఖైరతాబాద్ గణేషుడు.

ఖైరతాబాద్‌ గణేషుడి శోభాయాత్ర ఆలస్యంగా ప్రారంభం కానుంది. దీంతో అనుకున్న సమయం కంటే ఖైరతాబాద్ గణేషుని నిమజ్జనం మూడు గంటలు ఆలస్యంగా జరగనుందని అధికారులు చెబుతున్నారు. మండపంలోనే మహాగణపతిని ఇప్పుడే భారీ క్రేన్‌ సహాయంతో ట్రాలీపైకి చేర్చుతున్నారు.

ఖైరతాబాద్ గణేషుని శోభాయాత్ర ఇంకా ప్రారంభం కానప్పటికీ.. ఆ ప్రాంతం అంతా సందడిగా మారింది. శ్రీపంచముఖ మహాలక్ష్మి గణపతిగా కొలువుదీరిన ఖైరతాబాద్ గణేషుడు గంగమ్మ ఒడిలోకి చేరేందుకు సిద్ధమవుతుండడంతో భక్తులు భారీగా చేరుకున్నారు. తొమ్మిది రోజులపాటు విశేష పూజలు అందుకున్న మహాగణపతి.. మరికాసేపట్లో నిమజ్జనానికి ట్యాంక్‌బండ్‌ వైపు కదలనున్నాడు. పంచముఖ మహాలక్ష్మి గణపతిగా భక్తులకు దర్శనమిచ్చిన ఖైరతాబాద్‌ గణేశుని.. తుది పూజల తరువాత ట్రాలీపైకి ఎక్కిస్తున్నారు. ఇప్పటికే త్రిశక్తి మహాగాయత్రి, షణ్ముఖ సుబ్రహ్మణ్యస్వామి విగ్రహాలను ట్రాలీపైకి చేర్చారు.

50 అడుగుల ఎత్తు, 70 టన్నుల బరువుతో త్రిశక్తి మహాగాయత్రి, షణ్ముఖ సుబ్రహ్మణ్యస్వామి సమేతంగా కొలువుదీరిన ఖైరతాబాద్‌ గణేశుని శోభయాత్ర.. ఖైరాతాబాద్ సెన్సేషన్ థియేటర్‌, ఐఐఎంసీ కళాశాల చౌరస్తా, టెలిఫోన్‌ భవన్‌, పాత సచివాలయం గేటు, తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ చౌరస్తా, లుంబినీ పార్కు మీదుగా ట్యాంక్‌బండ్‌పైకి మొత్తం రెండున్న కిలోమీటర్లు సాగుతుంది. 

సుమారు 70 టన్నుల బరువున్న ఖైరతాబాద్‌ మహాగణపతిని తరలించేందుకు ఈ ఏడాది అత్యాధునిక ట్రాలీ వాహనాన్ని వినియోగిస్తున్నారు. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా ఖైరతాబాద్‌ గణేషుడిని ఎన్టీఆర్‌ మార్గ్‌లోని క్రేన్‌ నెంబర్‌-4 వద్దే నిమజ్జనం చేస్తారు. మోడ్రన్‌ కంపెనీకి చెందిన ఈ క్రేన్‌ వంద టన్నుల బరువును సునాయసంగా ఎత్తుతుంది.

Tags:    

Similar News