కరోనా బాధితుల కోసం ఖజానా జూవెలర్స్ భారీ విరాళం
కరోనా సంక్షోభంలో తెలంగాణ ప్రభుత్వానికి ఖజానా జువెలర్స్ భారీ విరాళం అందజేసింది.;
కరోనా సంక్షోభంలో తెలంగాణ ప్రభుత్వానికి ఖజానా జువెలర్స్ భారీ విరాళం అందజేసింది. కరోనా మహమ్మారిని అంతమెందించేందుకు తన వంతుగా ఖజానా జువెలర్స్ అధినేత కిషోర్ కుమార్ మూడు కోట్ల సాయం చేశారు. ఈ మొత్తాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్ర ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో ఐటీ మంత్రి కేటీఆర్ కు అందజేశారు. ఈ నిధిని కరోనా వైరస్ నిర్మూలన, కరోనా బాధితుల సంరక్షణలో భాగంగా వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ కు వినియోగించాలని అభ్యర్థించారు. ఖజానా జువెలర్స్ కిషోర్ కుమార్‌ను మంత్రి కేటీఆర్ అభినందించారు. సామాజిక దృక్పదంతో భారీ మొత్తాన్ని అందజేయడం అభినందనీయం అన్నారు. ఇలాంటి కష్ట సయమంలో చేసే సాయమేదైనా గొప్పదిగా ఉంటుందన్నారు. కిషోర్ కుమార్ మాట్లాడుతూ.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్ఫూర్తితో ఈ విధంగా ముందుకు వచ్చామన్నారు. ఇలా ప్రజల కోసం నిధిని విరాళంగా ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.