కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి జన ఆశీర్వాద యాత్రకు సన్నాహాలు..!
తెలంగాణలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి జన ఆశీర్వాద యాత్రకు సన్నాహాలు పూర్తయ్యాయి ఆగస్ట్ 19 నుంచి 21 వరకు మూడు రోజుల పాటు యాత్ర జరగనుంది.;
తెలంగాణలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి జన ఆశీర్వాద యాత్రకు సన్నాహాలు పూర్తయ్యాయి ఆగస్ట్ 19 నుంచి 21 వరకు మూడు రోజుల పాటు యాత్ర జరగనుంది. 384 కిలో మీటర్లలో 18 అసెంబ్లీ, 7 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో పర్యటన సాగనుంది. జన ఆశీర్వాద సభలో 40 చోట్ల సభలు నిర్వహించేలా ప్లాన్ చేసినట్టు బీజేపీ సీనియర్‌నేత ప్రేమేందర్‌రెడ్డి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా యాత్ర సాగుతుందని వివరించారు. దేశవ్యాప్తంగా కేంద్ర మంత్రుల ఆధ్వర్యంలో జన ఆశీర్వాద యాత్రలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.