TG : ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసిన కోదండరామ్, అలీఖాన్

Update: 2024-08-16 06:24 GMT

ఎట్టకేలకు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్ శాసనమండలిలో అడుగుపెట్టారు. గవర్నర్ కోటాలో ఆయనతో పాటు అలీఖాన్‌ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ప్రముఖంగా పాల్గొన్న కోదండరామ్‌ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్‌తో విభేదించారు. తెలంగాణ జనసమితి పార్టీని స్థాపించి, అప్పటి ప్రభుత్వంపై పోరాడారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో కోదండరామ్‌కు ఎమ్మెల్సీపదవి ఇచ్చి గౌరవించింది. ఈ కార్యక్రమంలో పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, విప్ బీర్ల అయిలయ్య, ఎంఎల్ సి మహేష్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, తదితరలు పాల్గొన్నారు. -ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసిన కోదండరామ్, అలీఖాన్ లకు పలువురు రాజకీయ నేతలు శుభాకాంక్షలు తెలిపారు.

Tags:    

Similar News