Komaram Bheem District: అంగన్‌వాడీలో కలెక్టర్ పిల్లలు.. అందరికీ ఆదర్శం..

Komaram Bheem District: అంగన్‌వాడీ అంటే ఒక ప్రభుత్వ పాఠశాల లాంటిదే. కానీ ఇప్పుడు వీటిని పెద్దగా ఎవరూ పట్టించుకోవట్లేదు.

Update: 2021-11-20 09:45 GMT

Komaram Bheem District: అంగన్‌వాడీ అంటే ఒక ప్రభుత్వ పాఠశాల లాంటిదే. కానీ ఇప్పుడు ఈ అంగన్‌వాడీలను పెద్దగా ఎవరూ పట్టించుకోవట్లేదు. వర్కింగ్ పేరెంట్స్ అందరూ తమ పిల్లలను వేలకు వేల ఫీజులు కట్టి మరీ.. ప్లే స్కూళ్లలో చేరుస్తున్నారు. అంతే కానీ అంగన్‌వాడీలో తమ పిల్లలను చేర్చేవారు మాత్రం కరువయిపోయారు. కానీ ఈ కలెక్టర్ మాత్రం తమ ఇద్దరు పిల్లలను అంగన్‌వాడీలోనే చేర్చి ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఈ మధ్య పలువురు కలెక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రిల్లో చికిత్స తీసుకుంటూ.. ప్రభుత్వ సేవలను వినియోగించుకుంటూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అదే తరహాలో కొమురం భీమ్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కూడా తమ కూతుళ్లను అంగన్‌వాడీలో చేర్చారు. జన్కాపూర్ అంగన్‌వాడీలో ఈ పిల్లలు చదువుతున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఆర్థిక స్థోమత సహకరించకపోయినా తమ పిల్లలను కచ్చితంగా ఇంటర్నేషనల్ స్కూళ్లలోనే చదివించాలని తల్లిదండ్రులు అనుకుంటున్న ఈరోజుల్లో కలెక్టర్ హోదాలో ఉండి కూడా రాహుల్ రాజ్ తన కూతుళ్లు నిర్వికరాజ్‌, రిత్వికరాజ్‌‌లను అంగన్‌వాడీలో చేర్చడాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. ఆయన పిల్లలు కూడా అక్కడ సరదాగా గడుపుతున్నట్టు అక్కడి అంగన్‌వాడీ టీచర్ చెప్తున్నారు.

Tags:    

Similar News