Komatireddy Raj Gopal Reddy : పార్టీ మార్పుపై త్వరలోనే ఓ స్పష్టత ఇస్తా : రాజగోపాల్‌ రెడ్డి

Komatireddy Raj Gopal Reddy : నల్గొండ జిల్లా నాంపల్లిలో జరిగిన కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి హాట్‌ కామెంట్స్‌ చేశారు.

Update: 2022-03-16 16:15 GMT

Komatireddy Raj Gopal Reddy : నల్గొండ జిల్లా నాంపల్లిలో జరిగిన కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి హాట్‌ కామెంట్స్‌ చేశారు.. పార్టీలో కొందరిపై ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు.. గౌరవం ఇవ్వని చోట తాను ఉండలేనంటూ కార్యకర్తల సమావేశంలో కుండబద్దలు కొట్టారు.

ఎవరి కింద పడితే వారికింద పనిచేయలేనన్నారు.. క్యారెక్టర్‌ లేనోళ్లు, నైతిక విలువలు లేనోళ్లు పార్టీలో పెత్తనం చేస్తుంటే బాధేస్తోందన్నారు.. సమస్యల విషయంలో కేసీఆర్‌పై పోరాడుతూనే ఉంటానన్నారు.. పార్టీ మార్పుపై త్వరలోనే ఓ స్పష్టత ఇస్తానని చెప్పారు.

తనను నమ్మిన వారు వెంట రావచ్చన్నారు.. కేడరే తన బలమని, కార్యకర్తలకు చెప్పకుండా తాను ఏ నిర్ణయం తీసుకోనని కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి చెప్పారు.

Similar News