నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను : కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
తనకు కాంగ్రెస్ పార్టీని వీడే ఉద్దేశం లేదన్నారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. తనకు పదవి దక్కలేదనే బాధ ఉందన్నారు.;
తనకు కాంగ్రెస్ పార్టీని వీడే ఉద్దేశం లేదన్నారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. తనకు పదవి దక్కలేదనే బాధ ఉందన్నారు. అందుకే నిన్న గాంధీభవన్‌లో రేవంత్ బాధ్యతల స్వీకారానికి వెళ్లలేదన్నారు. చాలా పార్టీల నుంచి ఆఫర్‌లు వచ్చాయని.. అలాగని మారతామా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన ఆయన.. ప్రజలకు ఎన్నో మంచి పనులు చేసినందునే ఇప్పటికీ YSను గుర్తుపెట్టుకున్నారని అన్నారు.