హెచ్సీయూ ఘటనపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తెలంగాణ భవ నిందితుడిగా ఉన్న మన్నె క్రిశాంక్ విచారణకు సహకరించాలని ఆదేశించింది. అదే విధంగా మరో నిందితుడు కొణతం దిలీప్ కు నోటీసులు జారీ చేయాలని సూచిస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. కంచ గచ్చిబౌలి భూములపై ఏఐ ఆధారంగా తప్పుడు పోస్టులు చేశారనే అభియోగంతో మన్నె క్రిశాంక్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 9, 10, 11 తేదీలలో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు విచారణకు హాజరుకావాలని సూచించారు. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించగా ఇవాళ విచారణ జరిపింది. దీనిపై పిటిషనర్ తరఫు న్యాయవాది రమణారావు వాదనలు వినిపిస్తూ.. ఒకే ఘటనపై నాలుగు ఎఫ్ఎస్ఐఆర్ లు నమోదు చేశారని అన్నారు. అన్ని సెక్షన్ల కు మూడేండ్లలోపే శిక్షలున్నాయని, వీటిని రాజకీయ దురుద్దేశంతోనే నమోదు చేశారని ఆరోపించారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. సోషల్ మీడియా హెచ్ సీయూ ఘటన పై లో ఏఐ వీడియోస్, ఫోటోలు పోస్ట్ చేసి వైరల్ చేశారని, మరో కేసులో సీఎంపై అనుచిత పోస్టులు పెట్టారని తెలిపారు. ఇప్పటి కే క్రిశాంక్ కు నోటీసులు జారీ చేశామని రేపు ( ఈనెల 9న) విచారణకు రావాలని సూచించా మని తెలిపారు. ఇరు వర్గాల వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం మన్నె క్రీశాంక్ పోలీసుల విచారణకు సహకరించాలని సూచించింది