Gachibowli: కొన్ని రోజులుగా కృతి మూడీగా ఉంటోంది- కృతి ఫ్రెండ్
Gachibowli: హైదరాబాద్ గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య కలకలం రేపుతోంది.;
Gachibowli: హైదరాబాద్ గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య కలకలం రేపుతోంది. నానక్‌రామ్‌గూడలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న జమ్మూ కాశ్మీర్‌కు చెందిన కృతి సంబ్యాల్.. రూమ్‌లో ఎవరూ లేని సమయంలో బలవన్మరణానికి పాల్పడింది. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు స్నేహితుడు సచిన్‌కు మెసేజ్ పంపింది. అతను అపార్ట్‌మెంట్ రాగా.. కృతి ఉరికి వేలాడుతూ కనిపించింది. హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కృతి ఆత్మహత్య చేసుకుందంటే నమ్మలేకపోతున్నామని రూంమెట్ శివాని పేర్కొంది. నిన్న ఉదయం కృతి ఏడుస్తూ కనిపించిందని, తన పర్సనల్ విషయాలు ఏవీ షేర్ చేసుకునేది కాదంటోంది శివాని.