KTR : మహదేవ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్.. హైకోర్టును ఆశ్రయించిన కేటీఆర్
భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలంటూ మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇటీవల మేడిగడ్డ సందర్శన సందర్భంగా డ్రోన్లు ఉపయోగించినందుకు ఆయనపై స్థానిక పీఎస్‌లో కేసు నమోదైంది. ఆ కేసును కొట్టేయాలంటూ కేటీఆర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మేడిగడ్డ సందర్శనలో భాగంగా బీఆర్‌ఎస్ నేతలు డ్రోన్ కెమెరాలు ఉపయోగించారు. అనుమతి లేకుండా సందర్శించడంతోపాటు డ్రోన్ కెమెరాలు ఉపయోగించారంటూ ఇంజినీర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంజినీర్ ఫిర్యాదుతో మహాదేవపూర్ పోలీసులు కేటీఆర్‌తో పాటు, గండ్ర వెంకటరామిరెడ్డి, బాల్కా సుమన్‌పై కేసు నమోదు చేశారు.