KTR : ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోకపోవడం సిగ్గుచేటు : కేటీఆర్
KTR : కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి కేటీఆ;
KTR : కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి కేటీఆర్. కేంద్రం తెలంగాణకు 9 మెడికల్ కాలేజీలు ఇచ్చిందని కిషన్‌రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఆయన చెప్పింది పూర్తిగా అపద్దమని ట్వీట్ చేశారు.
కిషన్‌రెడ్డికి క్షమాపణలు చెప్పే ధైర్యం కూడా లేదంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణకు ఇచ్చిన వాగ్ధానాలను కేంద్రం ఎందుకు తుంగలో తొక్కుతుందో చెప్పాలన్నారు. తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోకపోవడం సిగ్గు చేటన్నారు మంత్రి కేటీఆర్.