KTR : రాష్ట్ర ఆదాయం పడిపోతోంది.. -సంపద సృష్టించే నాలెజ్డ్ సీఎంకు లేదు : కేటీఆర్

Update: 2024-10-04 11:15 GMT

రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం క్రమంగా పడిపోతోందని, పరిపాలనా వైఫల్యానికి ఇది నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రభుత్వ ఆదాయం పడిపోతోందని, అనుభవరాహిత్యంతోనే ఈ అనర్థమని పేర్కొన్నారు. సంపదను సృష్టించి పేదలకు పంచే తెలివి ఈ ముఖ్యమంత్రికి లేకపోవడమే సమస్య అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది నుంచే ఈ దుస్థితి ఏర్పడితే రానున్న నాలుగేళ్లు మరింత కష్టమే అని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ గడ్డు పరిస్థితులను మరింత దిగజార్చే చేష్టలే తప్ప దిద్దుబాటు చర్యలు కనుచూపు మేర కూడా కనిపించడం లేదని ఆరోపించారు. తెలంగాణ ప్రగతి పథానికి పాతరేసిన పాపం... మార్పు మార్పు అంటూ మోసం చేసిన కాంగ్రెస్‌దే అంటూ తన ట్వీట్ ముగించారు.

Tags:    

Similar News