KTR: హిందూ, ముస్లింల మధ్య చిచ్చుపెట్టడం తప్ప బీజేపీ దేశానికి చేసిందేంటి: కేటీఆర్
KTR: హిందూ ముస్లింల మధ్య చిచ్చుపెట్టి చలిమంట కాచుకోవడం తప్ప బీజేపీ నాయకులు చేసిందేంటని నిలదీశారు మంత్రి కేటీఆర్.;
KTR: హిందూ ముస్లింల మధ్య చిచ్చుపెట్టి చలిమంట కాచుకోవడం తప్ప బీజేపీ నాయకులు చేసిందేంటని నిలదీశారు మంత్రి కేటీఆర్. మసీదులు తవ్వుదాం, శివలింగాలు అంటూ రెచ్చగొట్టడం తప్ప.. బండి సంజయ్ చేసిందేంటని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ఒక్కసారి అవకాశం ఇవ్వాలని అంటున్నారని.. యాభై ఏళ్లు అధికారంలో ఉండి ఏం సాధించారో చెప్పాలన్నారు. రాహుల్ గాంధీకి పబ్బులు, క్లబ్బుల గురించి తప్ప ఎడ్లు, వడ్ల గురించి ఏం తెలుసంటూ ఎద్దేవా చేశారు. జన్‌ధన్ ఖాతాలో డబ్బులు ఇస్తామని చెప్పిన మోదీ.. ఇప్పటివరకు ఎంతమందికి ఇచ్చారో చెప్పాలని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు.