TS : ఒకటో తారీఖు జీతాలే దెబ్బకొట్టాయి.. కేటీఆర్ హాట్ కామెంట్

Update: 2024-05-23 07:24 GMT

వరంగల్ ప్రచారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. ప్రమాణ స్వీకారం చేయగానే తొలిసంతకం రుణమాఫీ అని రేవంత్ రెడ్డి రైతులను మోసం చేశాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కేటీఆర్ ఉన్నారు. బుధవారం వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో భాగంగా వరంగల్ జిల్లాలో కేటీఆర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రెండు లక్షల ఉద్యోగాలను ఇచ్చామని, కాంగ్రెస్ పార్టీ బీఆర్ ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లో 30 వేల ఉద్యోగాలను తామే భర్తీ చేసినట్లు చెబుతున్నారని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్యయారు.

"ఉద్యోగులు మాకు ఓటు వేయలేదు. దేశంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకన్నా... రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అత్యధికంగా జీతాలు తీసుకున్నారు. 73 శాతం జీతాలు పెంచి మొదటి తారీకున జీతాలు ఇవ్వలేదని ప్రభుత్వ ఉద్యోగులు మాకు ఓటు వేయలేదు" అని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రెండులక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసినప్ప టికీ.. ఇచ్చిన ఉద్యోగాలను ప్రచారం చేసుకోవడంలో విఫలమయ్యామని కేటీఆర్ అన్నారు.

రైతుబంధు ఇస్తామని, కనీసం నాట్లు వేసుకునే సమయంలో కూడా రైతుబంధు ఇవ్వలేదని కేటీఆర్ అన్నారు. రైతు కూలీలకు నెలకు రూ.1000 చొప్పున 12 నెలలకు 12 వేల రూపాయలు రైతు కూలీల ఖాతాలల్లో వేస్తామని చెప్పి కూలీలను మోసం చేశారని కేటీఆర్ అన్నారు.

Tags:    

Similar News